#


Index


విభూతి యోగము

పోతే ఇక్కడ నిర్గుణ జ్ఞానమెలా ఉంటుందో వర్ణించామింత వరకూ. అలా కాక సగుణ జ్ఞానమే ఇందులో మహర్షి వర్ణించాడని చెప్పినా చెప్పవచ్చు. ఎందుకంటే తేషాం దదామి బుద్ధియోగమని తరువాతి శ్లోకంలో రాబోతున్నది. అప్పటికే వాడు జ్ఞాని అయితే ఇక కొత్తగా వాడికి బుద్ధి యోగాన్ని పరమాత్మ అందివ్వవలసిన ఆవశ్యకత ఏముంది. కనుక దాని కనుగుణంగా చెప్పుకొనేట్టయితే ఇలా చెప్పవలసి ఉంటుంది దీని కర్ధం. మచ్చిత్తా మద్గత ప్రాణాః - పరమాత్మనైన నా మీదనే మనసూ ప్రాణమూ పెట్టుకొని బోధయంతః కథయంతః నన్నే నిత్యమూ స్మరిస్తూ తుష్యంతి ఎవరైతే ఆనందిస్తుంటారో - అలాటి సగుణ భక్తులు కూడా గొప్పవారే. నిర్గుణమైన పరమాత్మ సగుణంగా కూడా ఉన్నాడు గదా. అదేగదా ఆయన విభూతి. ఎటు వచ్చీ విభువును గాక విభూతిగా దర్శిస్తున్నారు భక్తులు. సూర్యుణ్ణి కాకున్నా సూర్యాలోకాన్ని పట్టుకొన్నారు. ఈ ఆ లోకం ద్వారా దానికి మూలమైన సూర్యమండలాన్ని పట్టుకోటమే ఇక వారు చేయవలసిన పని.

  తేషాం సతత యుక్తానాం - భజితాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాముప యాంతితే - 10 ఎలాగూ అంతవరకు వారెదిగారు కాబట్టి ఇక ఆ పయి శిఖరాన్ని అందుకోటమంత అసాధ్యం కాదు. సతతయు క్తానాం తేషాం ఎడతెగకుండా భగవత్తత్త్వాన్నే సర్వత్ర మొక్కుబడి తీర్చినట్టు గాక ప్రీతి

Page 300

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు