వాడవుతాడు వ్యాసమహర్షి. అందుకే ఇలాటి అపోహ పోగొట్టటానికే ఇప్పుడు మరలా వర్ణిస్తున్నాడు. ఏమని అహం సర్వస్య - ప్రభవః మత్తస్సర్వం ప్రవర్తతే ఏ ఒక్కరో గాదు. ఏ ఒక్కటో గాదు. సమస్త ప్రపంచానికీ నేనే ప్రభవం. జన్మ స్థానం. మత్త స్సర్వం ప్రవర్తతే. సమస్త మూ నా లోనుంచే ఏర్పడుతున్నదని చాటుతున్నాడు మరలా. ఇందులో మొదటి మాట యోగానికీ రెండవ మట విభూతికీ వ్యంజకం. నేనే అన్నింటికీ మూలమన్నప్పుడు యోగం. అంటే స్వరూపం. నాలో నుంచే అన్నీ అన్నప్పుడది విభూతి. రెండూ చెప్పటంలో ఏమిటాంతర్యం. అంతా నా విస్తారమే కాబట్టి నాకు అన్యమైన పదార్ధమేదీ లేదు. చేతన ప్రపంచమే గాదు. అచేతనమైన అండపిండ బ్రహ్మాండాలు కూడా ఏవీ లేవు. అంతా నా విభూతే సుమా. కాబట్టి ఏ ఒక్కటీ ఈ ప్రపంచంలో నాకు భిన్నంగా చూడకండి. అలా చూస్తే అది నా స్వరూపం గాదని బోల్తాపడతారు. అప్పుడది నా విభూతిగా గాక సంసారంగా భాసించి మీ మెడకు చుట్టుకొంటుందని పరమాత్మ మనకు చేసే హెచ్చరిక.
కనుకనే ఇతి మత్వా అనాత్మ జగత్తును భగవద్విభూతిగా భావించమని ఆ భగవానుడి హెచ్చరికను మనకు వినిపిస్తున్నాడు మహర్షి. మత్వా అంటే మాటి మాటికీ మననం Reflection చేయండని అర్థం. అలా చేసిన మహానుభావులకే బుధులని పేరు. భజంతే మాం బుధాః - అలాటి బుధులే భజిస్తారా పరమాత్మను. ఎలా భజిస్తారు వారు. భావ సమన్వితాః భావ
Page 297