#


Index

విభూతి యోగము

చెప్పినట్టు ఏ లవలేశం భిన్నంగా చూచినా మోక్షమనేది ఆసించలేడు. భిన్నంగా చూడకుండా ఉండాలంటే మరి ఏమిటి షరతు. అనాత్మ అని మనం భావించే సర్వమూ ఆత్మనుంచే ఉద్భవించిందని మొదట గుర్తించాలి మనం. సర్వమూ దానిలోనుంచి వచ్చినప్పుడే దానికన్నా భిన్నంగా సర్వమూ లేకుండా పోయేది. తరంగ బుద్బుదా దు లన్నీ సముద్ర జలం నుంచి వచ్చాయన్నప్పుడే సముద్ర జలానికే ఒక్కటే అన్యంగా కనిపించదు. అలాగే ఆత్మ చైతన్యం నుంచి చరా చర పదార్ధాలూ ఏర్పడినప్పుడే ఇవి చైతన్యానికి అన్యం కావు. అలా కాక కొన్ని మాత్రమే ఆత్మ నుంచి సృష్టి అయి మరికొన్ని సృష్టి కాలేదంటే అప్పుడు వాటి కాత్మతో సంబంధం తెగిపోయి తమ పాటికి తాము స్వతంత్రంగా ఉండవలసి వస్తుంది. వస్తే అవి ఇక దాని కాభాస కావు. వాస్తవమే అవుతాయి. అయితే ఆత్మా వాస్తవమే అనాత్మా వాస్తవమే కావలసి వస్తుంది. అలాగైతే అది అద్వైతాను భవానికి దారి తీయదు. ద్వైత రూపమైన సంసారమెప్పటికీ తొలగిపోదు.

  కాబట్టి ఏ మహర్షు లేడుగురో ఏ మానవులు నలుగురో తన మానస సృష్టి అయి వారివల్ల ఏ ప్రజానీకమో వారి చిత్తవృత్తులో - అవి మాత్రమే తన్మూలంగా జన్మించాయని పేర్కొంటే సుఖం లేదు. మిగతా జడ చేతన ప్రపంచం పరమాత్మ సృష్టి కాదా అని సందేహ మేర్పడుతుంది మనకు. ఏర్పడలేదంటే అవి మాత్రమే పరమాత్మ విభూతి అయి తతి మా సృష్టి కాదని చెప్పవలసి వస్తుంది. అంతే కాదు. పరమాత్మతో లింకు తెగిపోయి పరమాత్మ ఎలా వాస్తవమో అవి కూడా వాస్తవమని ద్వైతాన్నే బలపరచిన

Page 296

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు