#


Index


విభూతి యోగము

జత చేసి దీన్ని దర్శిస్తాడో వాడే సమ్యగ్దర్శి సో వి కంపేన యోగేన యుజ్యతే. నిశ్చలమైన యోగంతో కూడుకొన్న వాడు వాడేనని కితాబిచ్చాడు పరమాత్మ. అప్రచలితేన యోగేన సమ్యగ్దర్శన స్థైర్య లక్షణేన అని వ్యాఖ్యానించారు భాష్యకారులు. అలాటి నిశ్చలమైన దర్శనమే సరియైన దర్శనమట. అంటే ఏమన్న మాట. కేవలం స్వరూపాన్ని చూచి తద్భిన్నంగా ఈ ప్రపంచాన్ని భావించినా అది సమ్య గ్దర్శనం కాదు. అలాగే స్వరూప జ్ఞానం లేకుండా కేవల మీ చరాచర ప్రపంచంతోనే వ్యవహరించినా కాదు. రెండూ విపరీత దర్శనమే. సంసార బంధానికి దారితీసేవే. అలా కాక అది సమ్యగ్దర్శనమే అనిపించుకోవాలంటే తీర్ధానికి తీర్ధం ప్రసాదానికి ప్రసాదమని వేర్వేరుగా చూడగూడదు. అనాత్మ ప్రపంచంలో ఆత్మనూ ఆత్మలో అనాత్మనూ ఒకదానితో ఒకటి ఏకం చేసి పట్టుకోవాలి. అప్పుడాత్మా ఆత్మే అనాత్మా ఆత్మే వాడి దృష్టికి. ఆత్మానాత్మలు రెండూ కలిసి ఏకాత్మగానే అనుభవానికి వస్తాయి. వస్తే ఇక సంసార బంధమనే ప్రసక్తి లేదు. బంధం లేదిక మోక్షమే మానవుడికి. నాత్రసంశయః - ఇక సంశయమే లేదు పొమ్మని హామీ ఇస్తున్నాడు పరమాత్మ మనకు.

అహం సర్వస్య ప్రభవః మత్త స్సర్వం ప్రవర్తతే
ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః - 8


  కాని సర్వమూ పరమాత్మే - పరమాత్మకు విలక్షణంగా ఏదీ లేదనే భావం మానవుడి కారూఢ మయినప్పుడే - అలా దర్శించినప్పుడే సంసార బంధం లేకుండా పోయేది. ఉదర మంతరం కురుతే అని బృహదారణ్యకం

Page 295

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు