బయటపెడుతున్నాడు పరమాత్మ. పరమాత్మ యోగమైతే ఆయన విభూతి ఈ సృష్టి. యోగమంటే అఖండమైన జ్ఞానం. విభూతి అంటే దాని విస్తారం. పరమాత్మ అంటే పరిపూర్ణమైన జ్ఞానమేనని గదా మొదటి నుంచీ చెప్పుకొంటున్నాము. జ్ఞానం పరమాత్మ అయితే జ్ఞేయమైన ఈ ప్రపంచమంతా ఆ జ్ఞాన విభూతి గాక మరేమిటి. ఆ జ్ఞానమే దేశకాల వస్తురూపంగా విస్తరించి ఇలా దర్శనమిస్తున్నది. జ్ఞాన మాయన స్వరూపం. ప్రపంచం దాని విభూతి. ఆయన సూర్యమండలమైతే ఆయన గారి సృష్టి సౌర ప్రకాశం. ప్రకాశం మండలం కన్నా వేరు కానట్టే చరా చర సృష్టి అంతా సృష్టి కర్త అయిన పరమాత్మకు వేరుగాదు. సృష్టి కర్తే సృష్టి. సృష్టిని చూస్తే సృష్టి కర్తే ఆ రూపంలో ఉన్నాడని చూడాలి. అప్పుడిక సృష్టి - సృష్టి కర్త అని రెండు లేవు. ఉన్న తత్త్వ మొకటే. అది అఖండమైన జ్ఞాన స్వరూపమే. అది మహర్షి మను ప్రజా ప్రభృతి సృష్టి రూపంగా భాసిస్తున్నది.
ఇదుగో ఇలా మమ యో వేత్తి తత్త్వతః - ఎవడైతే నా యోగ విభూతులను రెండింటినీ ఏకం చేసి ఏక రూపంగా దర్శిస్తాడో వాడే తత్త్వదర్శి అంటున్నాడు భగవానుడు. భగవాన్ అనే మాటకు కూడా అదే అర్ధమసలు. భగమంటే షాడ్గుణ్య రూపమైన విభూతే. అది నిత్యమూ దగ్గర పెట్టుకొని ఉన్న అఖండ చైతన్యమే వాన్ననే మాట కర్థం. ఇంతకూ అఖండ చైతన్యమే అసలైన ఆత్మ స్వరూపమని అర్థం చేసుకొని ఆ దృష్టి సడలకుండా ఈ అనాత్మ ప్రపంచమంతా అదే ఇలా విస్తరించి కనిపిస్తున్నదని ఎవడు దానితో
Page 294