తొలగుతుంటాయి. ఆ స్ఫురణను పక్కన బెడితే ఇవి ఎక్కడ ఉన్నాయి. అంతా హుళక్కే. అందుకే అవి నాలోనే గాని నేను వాటిలో లేనని చాటటం భగవానుడు. వస్తువా భాసలో ఉండదు. ఆ భాసే వస్తువులో ఉంటుంది. వస్తువా భాసలో ఉంటే వస్తువు కూడా ఆ భాస అయి ఇక వస్తువనేదే లేకుండా పోతుంది. అలాకాక ఆ భాసే వస్తువులో ఉంటుందని గుర్తిస్తే అది కూడా వస్తువుగా మారి అప్పుడంతా వస్తువే నా ఆత్మ స్వరూపమే ననే అద్వైత భావ మనుభవానికి వస్తుంది. స్వరూపాన్ని మరచిపోయి చూస్తే సంసారం. స్వరూపాన్ని గుర్తించి చూస్తే విభూతి. మొదటిది బంధకమైతే రెండవది మోచకం. ఇప్పుడీ భావమే ప్రస్తుత మిక్కడ కూడా మన మన్వయించు కోవలసి ఉంది. అక్కడ ఆ శ్లోకంలో వాచా చెప్పాడు. ఇక్కడ వ్యంగ్యంగా దాన్నే సూచిస్తున్నాడు పరమాత్మ. అంతే తేడా.
మహర్షయ స్సప్త పూర్వే చత్వారో మనవస్తథా
మదీయా మానసా జాతా - యేషాం లోక ఇమాః ప్రజాః - 6
ఈ విధంగా మానవుల మనోభావాలనే గాదు. మానవులను కూడా సృష్టించిన వాడు పరమాత్మే. ఒక్క మానవులనే గాదు. వారి భావాలనే గాదు. ఆ మాటకు వస్తే మహర్షులనూ మానవులనూ గూడా పరమాత్మే సృష్టించాడు. సృష్టికే ఆది తానయినప్పుడు తాను గాక ఎవరు సృష్టిస్తాడీ ప్రాణి కోటిని. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా అని గదా ఇంతకు ముందే చాటి చెప్పాడు. అలాంటప్పుడు మహర్షులేమిటి మనువు లేమిటి. క్రొత్తగా చెప్పాలా వీరాయన వల్ల సృష్టి అయ్యారని.
Page 289