ఎంత తప్పో మనసే ఆలోచిస్తున్న దంటే అంత తప్పే. అలా కాక ఈ ఆలోచనలు మనసులో ఏర్పడుతుంటే మన దృష్టి మనసు వరకే ఆగిపోకుండా దీనికీ ఆలోచనా శక్తి ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నదా అని దీని కధిష్ఠాన మైన origin ఆత్మ వైపు మళ్లాలి. దాన్ని అన్వేషించి పట్టుకోవాలి. అప్పుడీ మనస్సు దానికొక ద్వారం మాత్రమే ననే రహస్యం మనకు తెలిసి పోతుంది. తెలిస్తే మనోభూమికను దాటి మన అసలు స్వరూపమైన ఆత్మలో ప్రవేశిస్తాము. ప్రవేశిస్తే మనోజన్యమైన సంసార బంధం నుంచి తప్పించుకొని బయటపడతాము. ఇదీ ఇందులో ఉన్న ఆంతర్యం. మత్త ఏవ నా నుంచే సమస్తమూ ఏర్పడుతున్నదన్నా డంటే అర్ధం దీనికి మూలం నీ మనస్సను కొంటున్నారేమో అది గాదు మూలం. దానికి కూడా మూలమైన అసలైన ప్రత్యగాత్మే సుమా అని మనమందరమూ ఎప్పటి నుంచో మరచిపోయి బతుకుతున్న ఒక గొప్ప సత్యాన్ని మనకు గుర్తు చేయటమిది. అలా గుర్తు చేయకుంటే మనమిలాగే బ్రతుకుతుంటాము. సంసార బంధంలో చిక్కి ఇదే సర్వస్వమని భ్రాంతి పడుతుంటాము. అలా కాక గుర్తిస్తే మన స్వరూపాన్నే మనం దర్శించి సాయుజ్య సుఖమను భవిస్తాము.
ఇక్కడ ఇంకా ఒక నిగూఢమైన అంశముంది మనం గ్రహించ వలసింది. ఇలాంటి శ్లోకమే ఇంతకు ముందు కూడా వచ్చింది. సప్తమాధ్యాయంలో పన్నెండవ శ్లోకమది. యే చైవ సాత్త్వికా భావా
Page 287