#


Index


విభూతి యోగము

మొత్తం మీద అవి మంచి భావాలనండి. పనికిమాలిన భావాలనండి. ఏవైనా మానవుడి మనసులో కలిగేవే. అన్నింటికీ అదే సీటు.

  కాగా ఇంతవరకే అయితే భగవద్గీతే మనకు వర్ణించి చెప్పనక్కర లేదు. ఇది లోకానుభవమే చెబుతున్నది మనకు. శాస్త్రమెప్పుడూ మానవుడి అనుభవంలో లేని క్రొత్త విషయమేదో అది బోధ చేయాలి. కేవలం క్రొత్త దనే కాదు. అది తెలుసుకొంటే దానివల్ల గొప్ప ప్రయోజనం కూడా ఉండాలి మనకు. లేకుంటే అది కాక దంత పరీక్ష లాంటి దవుతుంది. ఏమిటిప్పుడా రహస్యం. ఏమిటది గుర్తిస్తే కలిగే ప్రయోజనం. భవంతి భావా భూతానాం మత్త ఏవ. ఈ మాటల్లో ఉంది మర్మం. ఈ భావాలన్నీ మానవులకు నావల్లనే కలుగుతున్నా యంటాడు పరమాత్మ. అంటే ఏమిటర్ధం. మనం మన మనస్సులో ఏ భావ ముదయించినా మనసే దాని దానిపాటికది ఆలోచిస్తున్న దని భావిస్తుంటాము. మనస్సు కాదు ఆలోచించటం. ఆలోచన మనసులో నుంచి గాదు. మనస్సుకు వెనకాల ఉండి దాన్ని నడుపుతున్న ఆత్మ చైతన్యం నుంచి. మనస్సు కేవలం దాని కొక ద్వారం మాత్రమే. స్వతంత్రం కాదది. స్వతంత్రమైనది ఆత్మ చైతన్యం. అదే ఈ మనస్సు ద్వారా ప్రసరిస్తుంటే దాన్ని ఆలోచన అంటున్నాము. మనస్సు దానికొక కొళాయి గొట్టం లాంటిది. గొట్టం జలాన్ని సృష్టించటం లేదు. నదీ ప్రవాహం నుంచి గొట్టంలోకి వస్తున్నదా జలం. మన మీ గొట్టంలో నుంచి వస్తున్న జలాన్ని మాత్రమే చూచి ఇదే సృష్టిస్తున్న దనుకొంటే

Page 286

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు