మొదట. అందులో జ్ఞానమనేది ఉండనే ఉంటుంది. అసమ్మోహః - అయితే అది సమ్మోహం లేకుండా సాగిపోతుండాలి. అప్పుడు క్షమాదులైన మంచి గుణాలు బయటపడి కనిపిస్తాయి. క్షమ అంటే సహనం. సత్యమంటే నలుగురికీ హితమైన మాట. దమం శమ మంటే ఇంద్రియ మనో నిగ్రహం. తన్నిమిత్తంగా కలిగేది సుఖం. అలా కాకుంటే ప్రాప్తించేది దుఃఖం. భవః అభావః బుద్ధి దగ్గరి నుంచీ శమం వరకూ సద్భావాల వల్ల సుఖం ప్రాప్తిస్తే అది భవం. అలాకాక తద్విపరీత భావాల మూలంగా దుఃఖమే ప్రాప్తమైతే అది అభావం. భయం చా భయ మేవచ. అందులో మొదటి దానివల్ల అభయమైతే రెండవ దాని మూలంగా భయమే ఎప్పుడూ జీవితానికి.
ఇంతకూ ముక్తసరిగా చెబితే అహిం సా సమతా తుష్టిః ప్రాణినీ హింసించే బుద్ధికి స్వస్తి చెప్పి సర్వ సమానమైన దృష్టితో చూస్తూ పోతే అదే మనస్సు తుష్టినీ పుష్టినీ చేకూరుస్తుంది. తపోదానం. అదే తపస్సూ. అదే దానం నిజానికి. పదిమందికి మేలు చేయాలి మంచిగా బ్రతకాలనే తపనే తపస్సు. అది వాడి ప్రవర్తనలో కూడా కనిపిస్తే దానం. సంవిభాగ శీలతా అంటారా చార్యుల వారు. అందరితో పంచుకొని అనుభవించే స్వభావమే దానమంటే. యశో యశః - పోతే ఇలాటి సద్గుణాలన్నీ అలవరుచుకొని బ్రతక గలిగితే దానివల్ల మానవుడికి సత్కీర్తి లభిస్తుంది లోకంలో. లేదా ఎక్కడ లేని దుష్కీర్తి నీ మూట గట్టుకొంటాడు.
Page 285