కశ్యపుడంటే ఎవరోగాదు. పశ్యకుడు. చూచేవాడు. అది మానవుడి బుద్దే. అదే నిత్యమూ చూస్తుంటుంది. భూత భవిష్యత్తులనూ చూస్తుంది. మంచి చెడ్డలనూ గమనిస్తుంటుంది. ఆ మంచి చెడ్డల తాలుకు ఆలోచనలే అది గన్న సంతానం. అందులో దితి సంతానం దైత్యులైతే ఆదితి సంతాన మాదిత్యులు. దితి అంటే భేద దృష్టి. అదితి అంటే అభేద దృష్టి. బుద్ధి తాలూకు భేద దృష్టి వల్ల దైత్యులను కొంటే అభేద దృష్టి వల్ల ఆదిత్యులను కోవచ్చు. ఇది బృహ దారణ్యకం లోకానికి బోధించిన పురాణ కధా సంకేతం. చివర దదద అనే సంకేతం ద్వారా కూడా బయటపెట్టిందిదే రహస్యమా ఉపనిషత్తు. దమ దాన దయలు మూడూ అలవరుచుకొని బాగుపడమని ఎవరికి చెప్పింది ప్రజాపతి. దేవ దానవులకు కాదు మూడు గుణాలూ మానవుల నుద్దేశించే బోధించాడని గదా భాష్యకారులు కూడా అక్కడ వివరించారు. కనుక సమ్మోహం లేకుంటే మానవుడే దేవత. పరమాత్మను అజమవ్యయ మని అనుభవానికి తెచ్చుకోగలిగితే వాడే ఋషి. అసమ్మూఢఃవేత్తి అనే రెండు మాటలలో నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక రహస్యమిదే.
అది గుర్తించి శ్రేయో మార్గంలో పయనించి మానవ జన్మ సఫలం చేసుకోమనే ఇప్పుడీ శ్లోకం మనలను హెచ్చరిస్తున్నది. ఎలాగ. మనసులో అనుక్షణమూ ఉదయించే భావాలొకటి గాదు రెండు గాదు. సవాలక్ష. ఏమిటవి. ఎలాంటివి. మానవుడు బుద్ధి జీవి గనుక బుద్ధి అనే దుంటుంది
Page 284