అర్థం చేసుకొంటాడో వాడే బంధ విముక్తుడు కాగలడని. సర్వపాపైః ప్రముచ్యతే. అలాటి మానవుడు మొదట అవిద్య అనే పాపం నుంచి బయటపడతాడు. పడితే అది కామకర్మలనే మిగతా రెండు పాపాలకూ జవాబు చెబుతుంది. దానితో కర్మఫలం లేదు. ఫలానుభవమైన జనన మరణాది క్లేశాలూ లేవు మానవుడికి. లేకుంటే అప్పుడిక మర్యుడు కాదు వాడు. అమర్యులని మనం భావించే దేవతల కన్నా అతీతమైన అసలైన అమర్త్యత్వాన్నే అందుకొంటాడు. అసలు దేవతలూ మహర్షులూ ఎక్కడున్నారు సృష్టిలో. అసమ్మూఢుడైన మానవుడే దేవత. అంతేగాక పరమాత్మను దర్శించిన వాడే మహర్షి. ఋషి అంటే దర్శించిన వాడేనని గదా అర్ధం.
బుద్ధి రాన మస మ్మోహః - క్షమా సత్యం దమః శమః
సుఖం దుఃఖం భవో భావో- భయం చా భయ మేవచ - 4
అహింసా సమతా తుష్టి స్తపో దానం యశో యశః
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృధ గ్విధాః - 5
భవంతి భావా భూతానాం - దైవాసుర శక్తులని గదా సూచించా మింతకు ముందు. అవేవో గావు. ఎక్కడో లేవు. మానవుల మనస్సులలో ప్రతిక్షణమూ ఉదయించే ఆలోచనలే. అందులో మంచీ ఉంటుంది. చెడ్డా ఉంటుంది. మంచివైతే అవే దేవతలు. చెడ్డవైతే అవే రాక్షసులు. కశ్యప ప్రజాపతి సంతానమని గదా దేవదానవులను పేర్కొంటాయి పురాణాలు.
Page 283