జ్ఞాన యోగము
భగవద్గీత సర్వస్వం
అడుగున బడిపోయింది. తన్నిమిత్తంగా అమర్త్యుడైన మానవుడు మర్త్యుడని పించుకోవలసి వచ్చింది. అసలు వీడికి బుద్ధి జీవుడని గదా పేరు. కర్మజీవులు పశుపక్ష్యాదులైతే భోగ జీవులు దేవాది జాతులైతే బుద్ధి బలమున్న జీవి మానవుడు. అది సవికల్పమైతే క్రింది స్థాయికి దిగబడి పోతాడు. నిర్వికల్పమైతే దేవతల కన్నా పయి స్థాయి నందుకొంటాడు. అదే వీడి ప్రత్యేకత. ఇలాటి అద్భుతమైన సౌకర్యమటు దేవతలనే వారికీ లేదు. ఇటు మృగప్రాయంగా బ్రతుకు సాగించే దానవులనే వారికీ లేదు. ఆ మాటకు వస్తే దేవతలూ దానవులూ అనే వారెక్కడా లేరనే గదా చెప్పాము. మానవుడి బుద్ధిలో చోటు చేసుకొన్న దైవాసుర శక్తులే మనోభావాలే అవి.
దానికి కారణం వారినెప్పుడూ అంటిపెట్టుకొని పీడిస్తున్న ఈ త్రివిధమైన పాపాలే. పడగొట్టేదేదో అది పాతకం పాపమని చెబుతూ వచ్చాము. అవిద్యాకామ కర్మలే ఆ పాపాలు. మొట్టమొదట మనలను పడగొట్టింది అవిద్య. సర్వమూ ఆత్మేననే జ్ఞానం లేకపోవటం. తన్నిమిత్తంగా ఆత్మే అనాత్మ ప్రపంచంగా భాసించే సరికది నాకు కావాలని కోరటం కామం. అలాటి కామం నెరవేరాలంటే దాన్ని పోగు చేసుకొనే క్రియ కావాలి. అదే కర్మ. పోతే దానికి ఫలం. దానికి తగిన అనుభవం. ఇక చెప్పనక్కర లేదు. ఇది ఒక విషవలయం. ఇదే సంసార బంధం. ఇప్పుడీ బంధంలో నుంచి బయటపడాలంటే ఏమిటి మార్గం. అదే చెబుతున్నాడు పరమాత్మ అజమూ అనాది అయిన నా అసలు తత్త్వాన్ని ఏ మానవుడు చక్కగా
Page 282