#


Index



జ్ఞాన యోగము భగవద్గీత సర్వస్వం

రహస్య మిదంతా హుళక్కి అయిపోయేది. ఎలా గ్రహించా లంటారది. అదే మనకు బోధ చేస్తున్నా డిప్పుడా పరమాత్మే స్వయంగా. ఏమని. యో మా మజ మనాదించ - వేత్తి లోక మహేశ్వరం. అజుడూ అనాదీ అంటే జనన మరణాలు రెండూ లేనివాడని అర్ధం. అవి రెండూ లేనివాడే లోక మహేశ్వరుడు. సమస్త లోకాలనూ శాసించ గలవాడు. సమస్త లోకాలంటే దేవ దానవ మానవజాతులే. వారందరి మీదా అధికారం చెలాయించాలంటే వాడీ విధంగా భగవత్తత్త్వాన్ని పట్టుకొంటేనే. అసమ్మూఢ స్స మర్త్యేషు. ఎవడలా పట్టుకోగలడో వాడే అసమ్మూఢు డంటున్నాడు పరమాత్మ. అజ్ఞాన గంధం కూడా లేనివాడు. మహాజ్ఞాని. ఎవడలాటి వాడు. ఇంద్రాది దేవతలా. హిరణ్యాది దానవులా. దివ్యశక్తులన్నీ ప్రదర్శించే దేవతలూ కారు. దీర్ఘకాల తపస్సంపన్నులైన దానవులూ కారు - వారెవరూ కారు జ్ఞానులు. కర్మ జ్ఞానాలకు రెండింటికీ అధికార Competency మున్న వాడు మానవుడే నని చాటుతున్నది శాస్త్రం. ఒకటి ధర్మం మరొకటి మోక్షం. ఆ రెండు పురుషార్ధాలకూ అర్హుడు మానవుడే. కనుకనే పురుషార్ధమని Aim of hu-man Life పేరు సార్ధకంగా పెట్టారు దానికి. మానవుడి కొక్కడికే సుమా నన్ను గుర్తించి జన్మరాహిత్యం పొందే అవకాశమని చాటటానికే మర్త్యేషు అని స్పష్టంగా ప్రయోగించాడు ఒక మాట వ్యాస భగవానుడు.

  మర్యుడంటే మానవుడు. అమర్త్యుడైన Immortal స్వభావం లోపల ఉండి కూడా అవిద్యా కామకర్మలనే త్రివిధ పాపాల మూలంగా అది మనకు

Page 281

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు