#


Index

విభూతి యోగము

అయినారని చెబుతున్నదు పనిషత్తు. దేవేంద్రుడికైతే అసలది కనపడనే లేదట. ఎంతో ధ్యానం చేస్తే విద్యాధి దేవత ప్రత్యక్షమయి దాని సంగతి తెలిపిందట. ఇక విశ్వామిత్ర అగస్త్య దుర్వాసుల లాంటి మహర్షులైతే ఎప్పుడూ కోపతాపాలు ప్రదర్శించటమే గాని అసలీ సృష్టికి మూలమేదో ప్రశాంతంగా ఆలోచించి పట్టుకొన్న దేముంది. పట్టుకొంటే అలాటి దురాగ్రహానికి గురి అవుతారా. ఆఖరుకు వసిష్ఠుడు కూడా ఆకల్మాష పాదుణ్ణి ఎందుకలా తొందరపడి శిక్షించటం. తప్పు నాది కాదో అని ఆయన మొరపెడుతున్నా వినిపించుకొన్నాడా. అసలు మాంస భక్షణ చేయాలని కోరటమేమిటీ మహర్షులు. నారద మహర్షి అంతవాడికి మాత్ర మర్ధమయిందా కృష్ణ లీల. ఇలా ఏకరువు పెడుతూ పోతే ఎంత దూరమైనా పోతుందీ వ్యవహారం. కృత మతి విస్తరేణ.

  మరి ఎంతో శక్తి సంపన్నులూ మేధా వంతులని గదా భావిస్తుంటాము వారందరినీ మనం. అలాంటి ఊర్ధ్వ లోక వాసులకు కూడా భగవత్తత్త్వాన్ని గ్రహించే శక్తి చాలదంటే ఏమిటర్ధం. ఎందుకని వారు దాన్ని గ్రహించలేక పోయారని ప్రశ్న వస్తే సమాధాన మిస్తున్నాడు భగవానుడు. అహమాదిర్హి దేవానాం - మహర్షీణాంచ సర్వశః - నేనే ఆ దేవతలకూ ఈ మహర్షులకూ ఇద్దరికీ కూడా ముందున్న వాడను. నేను మొదటి నుంచీ ఉన్నవాడను గనుకనే నా తరువాత వచ్చిన వీరికి నన్ను పట్టుకొనే శక్తి లేదంటాడు. ఇలా అనటంలో ఒక ఆంతర్యం స్ఫురిస్తున్నది మనకు. ఆది అనటంలో

Page 279

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు