#


Index

విభూతి యోగము

అందుకే చెబుతున్నాడు పరమాత్మ. నమే విదుః సురగణాః ఇంద్ర వరుణాది దేవతలకూ అంతు పట్టదు. న మహర్షయః - విశ్వామిత్రాది మహర్షులకూ గుర్తు చిక్కదని. ఏమిటా గుర్తు చిక్కనిది. ప్రభవం. నా అసలు స్వరూపం. ఇది ఒక అర్థం. పోతే ప్రభవమంటే ప్రభావమని కూడా అర్థమే. అప్పటికే మన్న మాట. పరమాత్మ అసలు స్వరూపమూ అర్థం కాలేదు వీరికి. దాని విభూతి అంతకన్నా బోధపడలేదు. స్వరూప విభూతులు రెండూ వారి కగమ్యం. గోచరం కాదు. అధిష్ఠాన జ్ఞానమున్నప్పుడే ఆరోపిత మర్దమవుతుంది - సువర్ణమంటే ఏమిటో దాని జ్ఞాన మున్న వాడికే గదా దాని వికారాలైన కటక కుండల కేయూరాది ఆభరణాలన్నీ దాని రూపాలే ననే సత్యం బోధపడేది. అలా కాకపోతే అదేమిటో ఇవేమిటో రెంటికీ సంబంధమే లేకుండా పోతుంది. రెంటినీ కలిపి అర్థం చేసుకోక పోతే అది మిధ్యా జ్ఞానమే గాని సమ్యగ్ జ్ఞానమని పించుకోదు.

  ఇప్పుడిలాటి సమ్యగ్దర్శనానికి నోచుకోనివారే చాలావరకూ అటు దేవతలు గాని ఇటు మహర్షులు గాని. ఉపనిషత్తులే మనకు సాక్ష్యమిస్తున్నాయి ఈ విషయంలో. కేనోపనిషత్తులో కథ విన్నారుగా. ఏమిటా కధ. దేవతలందరూ కొలువుదీరి అప్సరసలు నాట్యం చేస్తుంటే వారికి బుద్ధి చెప్పాలని పరమాత్మ ఒక అంతు పట్టని రూపంలో దూరాన కనిపిస్తాడు. అదేమిటో తెలుసుకోటానికి అగ్ని దేవుడూ వాయుదేవుడూ ప్రయత్నించి కూడా విఫలులైనారు. అంతేగాక అవమానంపాలు కూడా

Page 278

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు