#


Index

విభూతి యోగము

అస లర్జును డేమిటి. ఈ కాలంలో మనబోటి అర్జునుల మేమిటి. ఏకాలంలో ఏ మానవుడు కోరినా ముఖప్రీతిగా చెప్పే మాటలే. అలాటి విషయాలే. ఆ భాసే కావాలి గాని మానవులకు అసలైన పదార్ధం కాదు. ఆ మాటకు వస్తే మానవులే గాదు. ఆఖరుకు ఎంతో మనకన్నా గొప్ప వారని భావించే దేవతలూ అంతే. మహర్షులూ అంతే. ప్రియమే గాని తమ జీవితానికి హితమేదో ఎవరికీ అక్కర లేదు. అసలు చెప్పినా అంతు పట్టదు. దేవలోకంలో నివసించే దేవతలనే తీసుకోండి. నిరంతరమూ రంభాగ్య ప్సర సల నాట్యాన్ని తిలకించటమూ - కల్పవృక్షం ప్రసాదించిన మద్యాన్ని సేవించటమూ - కామధేనువు నడిగి అన్ని దివ్య భోగాలూ అనుభవిస్తూ కూచోటమూ - ఇదే గదా జీవితయాత్ర వారికి. ఇలా జీవించటమే గదా జీవిత పరమార్ధం. ఇంతకు తప్ప మరేమి కావాలి వారికి. పైగా అజరులు కాబట్టి ముసలి తనం రాదు. త్రిదశులన్నారు దేవతలను. ముప్పది ఏండ్లకు మించి ఉండదెప్పుడూ వయసు. పోతే అమరులు కాబట్టి చస్తామనే భయం లేదు. అవి రెండూ లేకుంటే ఇక మోక్షాన్ని గురించిన చింత ఏముంది వారికి.

  ఇక మహర్షులంటారా. ఘోరమైన తపస్సులు చేయటం దాని వల్ల ఏవేవో మహిమలు సంపాదించటం ఆ దర్పంతో తమంత వారు లేరని అహంకరించటం తమ దానికడ్డు తగిలే వారిని శాపాలతో నిగ్రహించటం తమ కాళ్లు నెత్తిన పెట్టుకొనే వారినందరినీ వరాలతో అనుగ్రహించటం ఇంతేగా వారి పని. అదేగా వారి జీవితం. అంతకు మించి వారికి మాత్రమేముంది బ్రహ్మ చింతన.

Page 277

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు