#


Index

విభూతి యోగము

మనకు హితం గాకపోవచ్చు. నిజంగా మనకు హితమైనది ప్రియం గాక పోవచ్చు. అది మన జీవితాలలో చూస్తూనే ఉన్నాము. అది మనకు స్పష్టంగా తెలియకపోతే పెద్దలైన వారు మనకు తాత్కాలికంగా అప్రియమైనా శాశ్వతంగా ఏది హితమో అదే బోధించవలసి ఉంటుంది. కఠోపనిషత్తు గుర్తు వస్తుందీ సందర్భంలో. యమ ధర్మరాజే మన్నాడు నచికేతుడితో. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్య మేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః ప్రేయస్సూ శ్రేయస్సూ అంటే ప్రియ మూ హితమే. అవి రెండూ ఏదేదో తెలియక మోసపోయే ప్రమాదముంది. కాని నీవు రెండింటినీ వివేచన చేసి ప్రియానికి బదులు జీవితానికేది హితమో అదే కావాలని కోరుతున్నావని మెచ్చుకొంటాడు ఆ కుర్రవాణ్ణి.

  కాని ఇక్కడ నచికేతుడి లాంటి వాడు కాడర్జునుడు. పెద్దవాడైనా ఇంకా కుర్రవాడే. నీ మాటలు వింటుంటే ఎంతో మధురం నాకెంతో ప్రీతి దాయకమని ఆ పోతాడే గాని నాకు హితమైనదేదో అది కావాలని వాపోడు. అందుకే లీలా మానుషుడైన కృష్ణ పరమాత్మ అతని బేలతనాన్ని ఎత్తి చూపుతూ ఇలా మాటాడుతున్నాడా అని పిస్తుంది. ఏమని. ప్రీయ. మాణాయ వక్ష్యామి హితకామ్యయా అని. ప్రియం గాదోయి నీవు కోరవలసింది. హితం సుమా. అది నీవు కోరకపోయినా నీ తరఫున నేను నీకు హితమే కోరి చెబుతున్నాను వినమని హెచ్చరించటంలో ఇదీ వ్యంగ్యం.

నమే విదు స్సుర గణాః ప్రభవం న మహర్షయః
అహ మాది ల్హదేవానాం - మహర్షీణాంచ సర్వశః -2

Page 276

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు