#


Index

విభూతి యోగము

చెప్పిన మాటేదుందో అదే పరమం. అన్నిటికన్నా గొప్ప మాట. అప్పుడే అద్వైతాను భవం సాధకుడికి. అంత వరకూ ద్వైతమే. అది పరోక్షంగా భావించినా ద్వైతమే. ప్రత్యక్షా వగమమని గదా రాజ విద్య మనకు బోధించిన సత్యం. దానికి కట్టుబడి ఉండకపోతే ఎలాగ. అందుకే పరమం వచః అని నేను చెబుతున్నానంటే మరలా నీకది బోధిస్తున్నానంటే యోగ విభూతులు అంటే ఆత్మానాత్మలు రెండూ నీ స్వరూపంగా అనుభవానికి తెచ్చుకోమనే అద్వైత రహస్యం నీకు బయటపెట్టటమే నా వివక్షిత మంటున్నది భగవద్గీత. భగవత్పాదుల భాష్య పంక్తి కూడా అలాటి రహస్యాన్నే స్ఫురింప జేస్తున్నది మనకు. పరమమంటే నిరతి శయ వస్తునః ప్రకాశకమని అర్థం వ్రాశారాయన. వస్తువంటే ఆత్మ చైతన్యం. అదే అసలున్న పదార్ధం సృష్టిలో. మరి ఈ అనాత్మ రూపమని భావించే ఈ సృష్టో. ఇది దాని కతిశయంగా కనిపించవచ్చు నీ అవిద్యావశాత్తూ. కాని నిరూపిస్తే అతిశయ మేమీ లేదు. అది కూడా ఆత్మే సుమా అని ఇంత అర్థం గుప్తంగా ఇమిడి ఉన్నదా మాటలో. భగవద్గీతా సర్వస్వము

  పోతే యత్తేహం ప్రియ మాణాయ వక్ష్యామి హిత కామ్యయా. దీని అర్ధం పైకి చూస్తే మామూలుగా ఉంటుంది. నీకు నా మాటలంటే ఎంతో ప్రీతి. అందుకే నీ హితం కోరి నీకు నేననుకొన్న పరమార్ధం తెలుపుతానంటాడు పరమాత్మ. ఇది పరమాత్మ అనవలసిన మాటా. చాలా పేలవంగా లేదూ. ఎంచేత. ప్రియం వేరు. హితం వేరు. ప్రియమైనదంతా

Page 275

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు