#


Index

విభూతి యోగము భగవద్గీత సర్వస్వం

కడపటి శ్లోకమా అధ్యాయానికి. ఏమిటా శ్లోకాని కర్థం. నీవు నామీదనే మనసు పెట్టుకో. నన్నే భజిస్తూ ఉండు. నేనే లోకంగా బ్రతికితే చివరకు నన్నే పొందగలవని ఇలా నడుస్తూ పోతుందా శ్లోకం.

  బాగానే ఉన్నట్టుంది భావం. కాని నేను నేను అంటే చాలా. నేననే భావాన్ని మాత్రం పట్టుకొని కూచుంటే సరిపోతుందా. నేను ను పట్టుకొంటే మరి నాది ఏమయి పోవాలి. నేను యోగమైతే నాది దాని విభూతి అని గదా చెప్పాము. అలాంటప్పుడు రెండింటినీ కలిపి పట్టుకొంటే అది అద్వైత జ్ఞానమని పించుకొంటుందే గాని కేవలం నేననే భావాన్ని మాత్రం పట్టుకొని కూచుంటే ఎలా కాగలదు. నేను లేని నాది ఎలా పరిమితమో నాది లేని నేనూ అలాగే పరిమితం గదా. ఒకటి యోగం వరకే ఆగిపోతుంది. వేరొకటి విభూతి వరకే నిలిచిపోతుంది. చెప్పాము గదా రెండూ దేనిపాటి కది చూస్తే పరిమిత మేనని. రెండూ కలిపి పట్టుకొన్నప్పుడే అది పరిపూర్ణమైన తత్త్వం. అలాంటప్పుడు నన్నే పట్టుకో నన్నే సేవించు అని ఏక దేశం చేసి పేర్కొంటా డేమిటి గీతాచార్యుడు. అది దృష్టిలో ఉండే వ్యాసభట్టారకుడు దాన్ని సవరిస్తూ మరలా నీకు బోధిస్తున్నా నొక మాట వినమంటున్నాడు. నేను నాది అని ఏ ఒకటి పట్టుకొన్నా అది పరిపూర్ణం కాదు. పరిపూర్ణం కాకపోతే అలా చెప్పిన ఆ మాట పరమం కాదు. నేనును వదిలేసిన నాదీ పరమం కాదు. నాదిని వదిలేసి చెప్పిన నేనూ పరమం కాదు. ఆ మాటకు వస్తే నాదితో కలిపి పట్టుకొన్న నేనూ కాదు. ఆ నేను పరోక్షంగా కాక అపరోక్షమైన నా స్వరూపంగా దర్శించమని

Page 274

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు