ఒకప్పుడు కాకున్నా మరొకప్పుడైనా బుద్ధికి స్ఫురించ వచ్చునని మహర్షి ఉద్దేశం.
ఇంతకూ ఈ దశమాధ్యాయం చాలా గొప్పది. కారణమేమంటే ఇందులో చెప్పవలసిన అధ్యాత్మ శాస్త్ర విషయమంతా కలిసి వచ్చింది. భగవత్తత్త్వమూ వర్ణించాడిందులో. త ద్విభూతినీ అద్భుతంగా వర్ణించాడు. అందులోనూ ఎవరెవరి కేది అభిమతమో సులభమో అలాటి విశేషమూ వర్ణించాడు వ్యాసభగవానుడు. విభూతి అనే మాట కప్పుడు రెండర్ధాలు చెప్పినా చెప్పవచ్చు. వివిధ రూపాలుగా మారి కనపడటమూ విభూతే. విశేషరూపంగా కనపడటమూ విభూతే. రెండూ కలిసి మరలా వస్తు స్వరూపమే. అంతకన్నా వ్యతిరిక్తం కాదు. సముద్రమూ దాని తరంగ బుద్బుదాదులకూ ఎలాటి సంబంధమో అలాంటిదే ఆత్మానాత్మలకూ లేదా యోగ విభూతులకూ రెంటికీ ఉన్న సంబంధం. దీనికే తాదాత్మ్య సంబంధమని నామకరణం చేశా రద్వైతులు. ఉందంటే ఉంది సంబంధం లేదంటే లేదు. రెండవదేదీ ఉంటే గదా సంబంధం చెప్పటానికి. ఉన్నదొకే వస్తువది ఆత్మ చైతన్యం. అదే జీవ జగదీశ్వర రూపంగా విస్తరించి కనిపిస్తున్నదాయె. మరి ఒకటిగాక రెండెలా అవుతుంది. అది వస్తువైతే ఈ కనిపించేదిక ఏదైనా దాని విస్తారమే దాని విభూతే. ఆ వస్తువే జ్ఞానం. ఈ విభూతే కర్మ. ఈ జ్ఞాన కర్మలే సృష్టి అంతా. జ్ఞాన మధిష్ఠానమైతే కర్మ నామరూపాత్మకంగా దానిమీద జరిగిన అధ్యారోపం. ఇది ఏదో గాదీ
Page 272