#


Index

విభూతి యోగము

భూమండలం మీది నుంచి ఎక్కడో ఉన్న సూర్యమండలం వైపు మళ్లించటానికి. ఇది దాని విభూతేనని అర్ధం చేసుకోటానికి. అందుకేనేమో రూపం రూపం ప్రతి రూపో బభూవ - తదస్య రూపం ప్రతిచక్షణాయ ప్రతి ఒక్క పదార్ధ రూపంగా పరమాత్మ ఎందుకు మారాడు. మారి మనకిలా ఎందుకు కనిపిస్తున్నాడంటే వీటి ద్వారా ప్రతిచక్షణాయ. వెనక్కు తిరిగి మనమా పరమాత్మ తత్త్వాన్ని గుర్తించటానికి దర్శించటానికని చాటుతున్నది కఠోపనిషత్తు.

  అంటే విభూతి అనేది ఒక సంకేతమన్న మాట. సంకేతమనేది సత్యాన్ని పట్టుకోటాని కాధారం. ఆలంబనం. అదే దాని ప్రయోజనం. అంతకుమించి దాని కస్తిత్వమే లేదు. ఇప్పుడీ ప్రపంచమనేది కూడా అలాటి ఒక గొప్ప సంకేతమే Symbol. దీని ద్వారా మనమందు కోవలసిన సత్యమా పరమాత్మ భావం. ప్రపంచమనేది ఎందుకు సృష్టి అయిందో సృష్టి ప్రయోజనమీ వెలుగులో చూస్తే మనకిప్పుడు బాగా అర్థమవుతున్నది. ఇది సృష్టి కాకపోతే మనమా పరమాత్మ సాయుజ్య మెన్నటికీ ఆసించలేము. ఇదే దానికి ద్వారమన్నారు భగవత్పాదులు. అభాసే వస్తువును చూపుతుంది. చేరుస్తుంది. వస్తువు లక్ష్యమైతే దాని విభూతి దానికి లక్షణం. లక్షయతీతి లక్షణం. ఏది చూపుతుందో అది లక్షణం. చూపటం వరకే దాని ప్రయోజనం. తద్ద్వారా లక్ష్యాన్ని పట్టుకొంటే చాలు. ఇక దాని అస్తిత్వానికి ప్రయోజనం లేదు. దానికి వేరుగా కనిపించదు. కనిపిస్తున్నా అది వస్తువు

Page 267

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు