కంటే వేరుగా లేదని తెలుస్తూనే ఉంటుంది మనకు. ఇంతెందుకు ఒక అద్దాని కేమిటి ప్రయోజనం. అది ఎందుకు సృష్టి అయిందసలు. మన ముఖం చూపటానికి. మన ముఖం మన పాటికి మనం చూచుకోలేము. అసాధ్యం. అందుకే అద్దం కావలసి వచ్చింది. అదైతే చూపుతుంది మన ముఖం. అందులో ప్రతిఫలించి మన ముఖం మనకు కనిపించిందనుకో. అది ఇలా ఉందని గుర్తించిన తరువాత దాని ప్రయోజనం తీరిపోతుంది. ఇక ఆ అద్దమున్నా మనకది అక్కర లేదు. అలాగే ఈ ప్రపంచమనేది ఒక బృహద్దర్పణం. ఇందులో ప్రతి జడపదార్థంలోనూ చేతన పదార్ధంలోనూ ప్రతిఫలించి కనిపిస్తున్నదా సచ్చిదాత్మకమైన తత్త్వమే. ప్రతి ఒక్కటీ అస్తి భాతి అనే గదా చూస్తుంటాము. ఇదుగో ఈ సచ్చిత్తులను గుర్తించటానికే ఉన్నదీ సృష్టి అంతా.
ఇక్కడ ఇంకా ఒక విశేషముంది మనం గమనించవలసింది. మామూలు అద్దంలో బింబానికి వేరుగా ప్రతిబింబం లేదనే విషయం మాత్రమే గుర్తిస్తాము. ఇక్కడ అలా కాదు. నామరూపాలనే అద్దంలో ప్రతిఫలించిన పరమాత్మ ప్రతిబింబమే గాక నామరూపాలనే అద్దం కూడా పరమాత్మకు వేరుగా లేదు. ఎంచేత నంటే సర్వవ్యాపకమైన అద్దమిది. అలాంటప్పు డద్దమైనా అదే. బింబమైనా అదే. ప్రతిబింబమైనా అదే. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య - ఆత్మాన మాత్మనా ఆత్మని అని గీతా వచనం. అంటే ఏమన్న మాట. చైతన్యమాత్మ అయితే చైతన్య విభూతి
Page 268