#


Index

విభూతి యోగము

నదీ సముద్ర పర్వతాదికమైన విశేష రూపంగా కనిపిస్తే అది భౌతిక ప్రపంచం. తత్సంబంధమైన ఆలోచనా రూపంగా సుఖదుఃఖాదికమైన అనుభవాల రూపంగా చిత్తనేది విస్తరించి విశేషరూపంగా కనిపిస్తే భావ ప్రపంచం. ఈ సద్విశేష చిద్విశేషాలే నామరూపాలు. చిద్విశేషాలు నామమైతే Ideas సద్విశేషాలు రూపం Things. అన్నీ కలిసి మరలా సచ్చిత్తులనే సామాన్య స్వరూపమే. అది మన ఆత్మ స్వరూపమే.

  అయితే ఒక ప్రశ్న. వస్తువలాగే వస్తువుగా ఉండిపోక అది ఇలా విస్తరించి నామరూపాత్మకంగా ఎందుకు మనకు దర్శనమివ్వటం. అది తన కోసమని ఒక జవాబు. మనకోసమని మరొక జవాబు. తన కోసమని ఎందుకు చెప్పామంటే అలా కనిపించటం దాని స్వభావం. దాని ప్రకృతి. దాని శక్తి. పరా స్య శక్తి ర్వివిధైవ శ్రూయతే అని ఉపనిషత్తు. శక్తి అనేది ఊరక ఉండనివ్వదా తత్త్వాన్ని అనేక రూపాలుగా ప్రదర్శిస్తుంది దాన్ని. అప్పుడే శక్తి అనే దాని కర్ధం. లేకుంటే శక్తి ఉందో లేదో దానికి ఏమిటి నిదర్శనం. కాబట్టి పరమాత్మకున్న స్వభావమే ఆయన మాయాశక్తే ఇలా విస్తరించి చూపుతున్న దాయనను. అదే ఈ చరాచర ప్రపంచం. పోతే ఆయన దృష్టితోనే గాక మన దృష్టితో చూచినా ఇది మనకెంతో అవసరం. ఎలాగ. ఆ శక్తి చూపుతున్న ఈ ప్రపంచమనే విభూతి ద్వారా మరలా మానవుడా విభువును పట్టుకోవచ్చు. సూర్యరశ్మి మన భూమండలం దాకా ఇంతదూర మెందుకు వచ్చిందను కొన్నారు. ఈ రశ్మి ద్వారా మన దృష్టిని

Page 266

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు