#


Index

విభూతి యోగము

సర్వత్రా ప్రసరిస్తూ పోతే విభూతి. ఇంకా భగవద్గీత భాషలో చెబితే మొదటిది జ్ఞానం. రెండవది కర్మ. మొదటినుంచి చివరిదాకా ఇదే వరస. ఈ రెండు పట్టాల మీదనే నడుస్తూ పోతుంది భగవద్గీత అనే రైలు బండి. ఇంతకు ముందే సూచించాము కూడా ఈ సూక్ష్మం.

  అయితే రెండు అని పేర్కొన్నాము గదా అని ఇవి రెండూ దేనిపాటి కది వేరుగా ఉన్నాయని అపోహ పడరాదు మరలా. రెండు అనేది మాట సామెతే. వాస్తవంలో రెండు లేవక్కడ. ఉన్న పదార్ధమొక్కటే. అది యోగం లేదా నేననే జ్ఞానం మాత్రమే. అదే వస్తువు Actual. పోతే విభూతి అనేది ఏదోగాదు. అది ఆ నేననే జ్ఞానమే విస్తరించి అలా భాసిస్తున్నది. అందుకే దాని నా భాస అన్నారు. ఆ భాసే గాని అది తన పాటికి తాను వాస్తవం కాదు. వస్తువే మరొక అవతారం ధరించి కనిపిస్తున్నది. వస్తువు తాలూకు రూపమే. దాని విభూతే అది. వివిధ రూపాలలో కనిపిస్తున్న దేదో అది విభూతి. విశేష రూపంగా కనిపిస్తుంది కాబట్టి కూడా దాన్ని విభూతి అన్నారు. సూర్యమండలం సూర్య ప్రకాశం లాంటివివి రెండూ. సూర్యుడి కంటే దాని ప్రకాశం వేరుగా ఎక్కడ ఉంది. మండలమే సర్వత్ర విస్తరిస్తే ప్రకాశం. ఒకచోట ఉంటే మండలమన్నాము. విస్తరిస్తే ప్రకాశమన్నాము. ఈ విస్తరించిన ప్రకాశమేదో గాదు. అది మండలమే. అలాగే ప్రస్తుతమీ ప్రపంచమంతా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ అంటే సచ్చిద్రూపమైన తత్త్వమే గదా. అందులో సత్తనేది గృహారామక్షేత్ర

Page 265

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు