ఇతి
10. విభూతి యోగము
తొమ్మిదో అధ్యాయం రాజ విద్యా రాజ గుహ్యమయింది. పోతే ప్రస్తుతం పదో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము మనం. దీని పేరు విభూతి యోగం. యోగమనే మాట భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలకూ సాధారణంగా కనిపిస్తున్న మాటే. సాంఖ్యయోగ మన్నారు. కర్మయోగ మన్నారు. అన్ని అధ్యాయాలకూ యోగమనే పేరు పెట్టారు వ్యాసభగవానులు. ఈ అధ్యాయానికి కూడా అలాగే పెట్టారని పించవచ్చు. నిజమే. దీనికి కూడా యోగమనే పేరు సాధారణమే. అయినా మిగతా వాటికన్నా ఒక విశేషముంది ఇందులో. ఇది అధ్యాయానికే పెట్టిన పేరే గాక ఇందులో పేర్కొన్న విషయం కూడా యోగమే. ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి. నా యోగమూ విభూతి ఇవి రెండూ ఎవడు గ్రహిస్తాడో అని
Page 263