తున్నంత వరకూ మనం స్త్రీలమే. వైశ్యులమే. శూద్రులమే. అంటే ఆత్మజ్ఞాన శూన్యులం. బ్రాహ్మణులం కాము. క్షత్రియుల మంతకన్నా కాము. అంటే ఆత్మజ్ఞాన క్రియాశక్తి సంపన్నులం కాము. అయితే మరేమి చేయాలంటారు. ఉత్తమ జ్ఞాన సంపన్నులం కావాలంటే ఏమిటి మన కర్తవ్యం.
చెప్పాము గదా. ఆభాస రూపమైన సృష్టిని గాక వస్తు భూతమైన భగవ త్తత్త్వాన్ని పట్టుకోమని. మనసా వచసా కర్మణా ఆ తత్త్వాన్నే దర్శిస్తూ పోవాలి. ఎలాగని. మన్మనా భవ. నామీదనే మనసు పెట్ట మంటున్నాడు. మద్భక్తః నన్నే అంటిపట్టుకో మంటాడు. మద్యాజీ. నా ఆలోచనతోనే అన్ని కర్మలూ చేయమంటాడు. మాం ననుస్కురు. నన్నే సర్వాత్మనా శరణు వేడమంటాడు. యుక్వైవ మాత్మానం. ఇలా నీ శరీరాన్నీ వాఙ్మనో వ్యాపారాలనూ అన్నింటినీ నాకే అప్పగించి మత్పరాయణః నేనే జీవితానికి ఏకైక లక్ష్యమని భావించావంటే- మామే వాత్మానం ఏష్యసి - నన్నే చివరకు పొందగల వంటాడు. ఇక్కడ ఆత్మాన మనే మాటకు మనసని ఒక చోటా దానికి సాక్షి అయిన చైతన్యమని మరొకచోటా అర్ధం చెప్పుకోవలసి ఉంటుంది. మానవుడు తన మనసు నీవిధంగా మలుచుకో గలిగితే అది మాం ఆత్మానం. అది తనకు అన్యంగా గాక తనకూ తాను చూచే సమస్త ప్రపంచానికీ ఆ ఈశ్వరుడికీ సర్వానికీ ఆత్మగా స్వరూపంగానే అనుభవానికి వస్తుందని అర్థం చెప్పారు భాష్యకారులు.
Page 261