మానవుడుగా జన్మించావు కాబట్టి ధన్యుడవు. కారణం పురుషార్ధ సాధనమైన మనస్సొక టున్నది నీదగ్గర. అది పశుపక్ష్యాదుల లాగా వాసనారూపం కాదు Instinctive వివేచనాత్మకం Discriminative. దాని బలంతో ఈ చరాచర సృష్టికి మూలమేదో అన్వేషించి పట్టుకోగలవు. చివరకు బ్రహ్మ సాయుజ్యమే పొంది తరించగలవు. ఇంత దుర్లభమైన మానవ జన్మ ఎత్తి కూడా దాని ప్రయోజనమేదో గుర్తించక పశుప్రాయంగా బ్రతికిపోవటం కాదు నీవు చేయవలసింది. భజస్వమాం. సృష్టిని కాదు. సృష్టికి మూలమైన నన్ను పట్టుకో. అది నీ జన్మకు సార్ధకమని మానవ జాతినంతా హెచ్చరిస్తూన్నాడు పరమాత్మ. ఇలాగే వ్యాఖ్యానించారు భగవత్పాదులు గూడా.
మన్మనా భవ మద్భక్తో - మద్యాజీ మాం నమస్కురు
మామేవైష్యసి యక్వైవ - మాత్మానం మత్సరాయణః - 31
అయితే సృష్టినిగాదు సృష్టికి మూలమైన తత్త్వాన్ని పట్టుకోమన్నారే ఎందుకని. సృష్టి వస్తువు కాదు. ఆభాస. రజ్జు సర్పంలాంటి దిది. రజ్జువును పట్టుకొంటే భయం లేదు. కాని దాని ఆభాస అయిన సర్పాన్ని పట్టుకొంటే భయమే. అలాగే పరమాత్మ వస్తువైతే ఈ ప్రపంచ మాయన ఆభాస. దీన్ని పట్టుకొని సుఖం లేదు. సుఖం లేదనే చెబుతున్నారు కంఠోక్తిగా అనిత్యమ సుఖం లోకమని. సుఖమే లేదు. ఏ కొంచెమో ఉందని నీవు భ్రమపడ్డా అది క్షణికమే. అందుకు కారణం మనమీ భగవ దాభాసను పట్టుకొని అసలైన భగవ త్స్వరూపాన్ని మరచిపోవటమే. అలా ఆద మరచి బ్రతుకు
Page 260