శూద్రుడూ గాదు. అవి మన శరీరంలోనే ఉన్న బుద్ధీంద్రియ దేహాలకు కేవలం సంకేతాలు. మన శరీరమే శూద్రుడు. మన ఐంద్రియాలే వైశ్యులు. ఇవి రెండూ ఇంతకు ముందే వివరించాము. చాతుర్వర్ణ్యం మయా సృష్ట మనే శ్లోకం దగ్గర ఇలాగే గదా చెప్పాము. పోతే ఇక స్త్రీ అనేది కేవలం మన బుద్ధే. ఆత్మాత్వం గిరిజామతిః - ఆత్మ కధీనమైన ఉపాధి బుద్ధే. కాగా ఈ బుద్ధీంద్రియ శరీరాలే జీవ భావాన్ని కల్పించి మనలనీ సంసారంలో పడదోశాయి. పాపం వల్ల ఏర్పడ్డాయి గనుక పాప యోనులివి. ఆ పాప మేదోగాదు. అనాది కాల ప్రవృత్తమైన మన అవిద్య. అజ్ఞానం. అది కామాన్ని రెచ్చగొడితే అది కర్మకు పురికొల్పి మనలనీ విషయంలో పారేశాయి. ఇవి నాలుగు వర్ణాల వారికీ స్త్రీ పురుషులకూ అందరికీ పట్టుకొన్న పాపమే. దీన్ని పోగొట్టుకొని బయటపడాలంటే మాంహి పార్ధవ్య పాశ్రిత్య. పరమాత్మను పట్టుకోవాలి. ఎలాగ. అందరమూ బ్రాహ్మణులమూ క్షత్రియులమూ అయిపోవాలి. అంటే ఆత్మజ్ఞానమూ - దాని అభ్యాసమూ ఏమర గూడదని భావం.
ఇంతకూ మేము చెప్పేదేమంటే అనిత్య మసుఖం లోక మిమంప్రాప్య భజస్వ మాం. క్షణ భంగురమూ దుఃఖ భూయిష్ఠమూ అయినదీ మర్త్య లోకం. జన్మించిన ప్రతి ప్రాణీ ఎప్పటికైనా మరణించక తప్పదు. ఇలాంటి ప్రమాదంలో వచ్చి పడ్డావు నీవు. అయితే మిగతా జీవుల కంటే నీవు
Page 259