స్త్రీలైనా గార్గీ మదాల సాదులూ అలాటి వారే గదా. అయితే తేపి యాంతి పరాంగతిం. అప్పుడు మీరు తప్పకుండా జ్ఞానంతో భగవత్సా యుజ్యం పొందగలరని అభయ మిస్తున్నాడు.
పోతే ఇక జన్మాంతరంలో సుకృతమే చేసుకొని వర్తమాన జన్మ ఎత్తినవారైతే చెప్పనే అక్కరలేదు. కింపున ర్ర్బాహ్మణాః పుణ్యాః వారు బ్రహ్మజ్ఞానానికే నోచుకోగలరు. భక్తా రాజర్షయః - రాజస ప్రకృతులైనా సత్త్వగుణ స్పర్శ కూడా ఉన్న రాజన్యులైనా మంచిదే. సత్త్వాన్ని భగవద్భక్తి జలంతో శుద్ధి చేసుకోగలరు. మొత్తం మీద అలా సత్త్వ గుణ సంపన్నులైన వారే బ్రాహ్మణ క్షత్రియు లనుకోండి. తప్పేముంది. మనః ప్రాణాలకు సంకేతాలే బ్రహ్మ క్షత్రియు లంటే. అవి మరలా జ్ఞాన క్రియా శక్తులే. జ్ఞానమూ కర్మా. ఇవి రెండూ ప్రతివ్యక్తిలో అంతర్గతంగా ఉన్న గుణాలే. అవి పరిశుద్ధంగా ఉంటే బ్రాహ్మణులూ క్షత్రియులూ. కాకుంటే వైశ్యులూ శూద్రులూ. పరిశుద్ధి లేని స్త్రీ శూద్రాదు లందరూ భగవ త్తత్త్వాన్ని నిత్యమూ స్మరిస్తూ భజిస్తూ పోతే చాలు. నిసర్గంలో లేకున్నా నిరంతరా భ్యాసంతో నైనా ఉత్తమ మానవులుగా చెలామణి కాగలరు.
అసలిదంతా గాదు. ఈ శ్లోకానికి బాహ్యార్థం కాక అంతరార్థం చెప్పుకొంటే అద్భుతంగా ఉంటుంది. అప్పుడిక ఏ గొడవా ఉండబోదు. అదే వ్యాస మహర్షి హృదయమేమో నని కూడా నాకు నమ్మకం. అదేమిటంటే ఇక్కడ స్త్రీ అంటే స్త్రీ గాదు. వైశ్యుడంటే వైశ్యుడు గాదు. శూద్రుడంటే
Page 258