#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

అవకాశముంది. కాని అది ఉపయోగించుకొంటేనే. లేకుంటే ఆ పూర్వవాసనలే ప్రభావం చూపుతుంటాయి వాడి జీవితం మీద.

  ఇప్పుడీ రెండింటినీ మనసులో పెట్టుకొనే చెబుతున్నాడు భగవానుడు. స్త్రియో వైశ్యా స్తధా శూద్రాః - స్త్రీలూ వైశ్యులూ శూద్రులూ వీరు ముగ్గురూ యేపిస్యుః పాపయోనయః నికృష్టమైన జన్మ ఎత్తిన వారట. ఏమిటీ అన్యాయమని ఆశ్చర్యపడ నక్కర లేదు. బాగా అర్ధం చేసుకోవాలి మనమీ మాట. నికృష్టమైన పూర్వవాసనలతో జన్మించిన వారని అర్థం. అంతేకాదు. నికృష్ట వాసనాజాలంతో ఎవరు మనకిప్పుడు కనిపిస్తుంటారో వారు స్త్రీ వైశ్య శూద్రులని వ్యాఖ్యానిస్తే సరిపోతుంది. ఇక ఆక్షేపణ లేదు. ఇంతకూ ఇలా శాపనార్ధం పెట్టి తప్పించుకోవటం కాదు భగవానుడి ఉద్దేశం. అలా నికృష్టమైన సంస్కారాలతో జన్మించి నప్పటికీ అదే బంగారమని దానితోనే జీవించకుండా జన్మతో వచ్చిన ఆ మాలిన్యాన్ని కడిగేసుకొని బాగా బతకటానికి ప్రయత్నించాలి. మరలా ఉత్తమమైన సంస్కార మార్జిస్తూ పోవాలి. అది ఏదో గాదు. మాంహి పార్ధ వ్యపాశ్రిత్య అని సలహా ఇస్తున్నా డాయన. భగవ ద్వాసన అలవరుచుకొని ఈశావాస్యమిదం సర్వమని చూడటం నేర్చుకోండి. అప్పుడు మీకు పాప యోనులనే అపప్రథ తొలగిపోతుంది. నిసర్గ సిద్ధమైన దోషం సంస్కార బలంతో పూర్తిగా తొలగిపోయి పుణ్యయోనులు కాగలరు. అలాగే గదా అయ్యారు విదుర ధర్మ వ్యాధాదులు. శూద్రులైనా బ్రహ్మ జ్ఞాన నిష్ఠులే గదా వారందరూ.

Page 257

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు