#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

రాదది. జన్మ నా జాయతే శూద్రః అని జన్మతో ప్రతివాడూ శూద్రుడే. అంటే విద్యా వినయాది సంస్కారం లేనివాడని అర్ధం. ప్రతి మానవుడూ అలాటి వాడే పుట్టుకతో. తరువాత వయసు వచ్చి విద్యా బుద్ధులు గడించి సంస్కార వంతు డవుతాడు. సంస్కారా ద్విజ ఉచ్యతే అన్నారు. సంస్కార వంతుడైతే వాడికి ద్విజుడని పేరు. ద్విజ అంటే రెండు జన్మ లెత్తిన వాడు. చచ్చిన తరువాత అని గాదు రెండవ జన్మ అంటే. బ్రతికుండగానే భౌతికమైన జన్మగాక వైజ్ఞానికమైన ఇంకొక జన్మ అని భావం. కాని అలాటి జన్మ ఎత్తాలంటే అందరికీ చేతగాదు. దానికి ఇహంలో కృషి అయితే గతంలో జన్మాంతర సత్కర్మ పరిపాకముండాలి. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వ దైహికం అని భగవద్గీత చాటి చెప్పిందీ మాట. ఇంతకుముందు చేసుకొన్న దానికి ఫలితంగానే ఈ జన్మ ఎత్తాము. జన్మతో పాటు ఆ పూర్వజన్మ వాసన కూడా వెంటబెట్టుకొని వచ్చాడు ప్రతివాడూ. దాని కనుగుణంగానే వాడికీ జన్మలో ఆలోచనలూ మాటలూ చేష్టలూ ఏర్పడుతుంటాయి. అందులో కొందరికి సత్త్వం బాగా పని చేస్తుంటుంది. కొందరి కది అప్రధానమై రజస్సు పైకి వచ్చి నడుపుతుంటుంది జీవితం. ఇంకా కొందరికి రజస్సు పని చేస్తున్నా తమస్సు కూడా అంటుకొని ఉంటుంది. మరి కొందరికైతే తమస్సే 90 వంతులయి సత్వరజస్సులు నామమాత్రంగా ఉండిపోతాయి. దీనికే నిసర్గ Inhertance మని పేరు. ఇందులో లోపాలను మరలా మానవుడీ జన్మలో కృషి చేసి సవరించుకోవచ్చు.

Page 256

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు