వాడు మారడు. ఆచారానాచారాలు రెండింటినీ వాడు భగవ త్స్వరూపం లాగా తన కనన్యంగా భావిస్తుంటాడు. ఇక మార్పేమిటి. కనుక శశ్వ చాంతిం నిగచ్ఛతి. అనుక్షణమూ శాంతినే అనుభవిస్తుంటాడు. యోంత స్సుఖోంత రారామః అన్నట్టు వాడి మనసెప్పుడూ శాంతమే. సంక్షోభమావoత కూడా లేదు. ఆవంత లేకపోతే ఏవంతా లేదా జ్ఞానికి. ఇంతెందుకు. ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ప్రతిజ్ఞ చేసి చెబుతున్నా నేను. నీవూ చెప్పవచ్చు. నా భక్తుడైన వాడికెప్పుడూ ప్రణాశం లేదని హామీ ఇస్తున్నాడు. ప్రణాశమంటే తప్పిపోవటం. జారిపోవటం. జ్ఞాన నిష్ఠ నుంచి ఎప్పుడూ జారిపోవట మంటూ ఉండదు వాడికి. వాడికిక ప్రణాశ మేముంది. భక్తః అంటే జ్ఞాని అనే అర్థం. భజించటమంటే గట్టిగా పట్టుకోవటమనే గదా అర్ధం. గట్టిగా పట్టుకోటమంటే అనన్యంగా. అనన్య మన్నప్పుడు జ్ఞానమైనా అదే భక్తి అయినా అదే.
మాం హి పార్ధ వ్యపా శ్రిత్య - యేపి స్యుః పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తధా శూద్రా - స్తేపి యాంతి పరాంగతిమ్ - 32
కింపున ర్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయ స్తధా
అనిత్యమ సుఖం లోక మిమం ప్రాప్య భజస్వమామ్ - 33
ఇలాటి భక్తి అనండి జ్ఞాన మనండి. ఎవరు దీని కధికారులని Com-petent ప్రశ్న వచ్చింది. పుట్టిన ప్రతి మానవుడికీ ఉందా అర్హత లేక కొంతమంది కేనా. మానవు లందరికీ ఉంది కాదన లేము. కాని పుట్టుకతోనే
Page 255