#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

కాదు. సాధురేవ సమంతవ్యః - సజ్జనుడనే వాణ్ణి మనం భావించవలసి ఉంటుంది. ఎందుకంటే సమ్య గ్వ్యవసితోహిసః - సరియైన నిశ్చయ జ్ఞానముంది వాడికి లోపల. వాడు బ్రహ్మ స్వరూపుడే. పైకి కాని వాడిలాగా కనిపిస్తుంటాడు. పదిమందికీ ఏమిటా వీడిలా మాటాడుతాడిలా ప్రవర్తిస్తాడని విడ్డూరంగా తోస్తుంటుంది. అది కేవల మాభాసే. వాస్తవం కాదు. బాలోన్మత్త పిశాచవ త్తన్నారు పెద్దలు. ఆ మాటకు వస్తే ప్రహ్లాదాదుల ప్రవర్తన ఏమిటి. చదువుకోరా నాయనా అంటే నాకు వద్దు పొమ్మంటాడు. గురువులు చదివించబోతే వారి మాట వినకుండా కుర్రవాళ్ల నందరినీ వెంటబెట్టుకొని వారికి తానే ఏవేవో పాఠాలు చెబుతూ కూచుంటాడు. తండ్రి సవాళ్లకు మరలా అడ్డ సవాళ్లు వేస్తూపోతాడు. ఇలాటి వెన్ని లేవు పురాణ కధల్లో జ్ఞానులైన వారి వ్యవహారాలు. కొందరైతే గుడ్డా గోచీ లేకుండా తిరుగుతూ వచ్చిన అవధూత లున్నారు. దగ్గరికి వచ్చిన వారిమీద దుమ్మూ ధూళీ కూడా ఎత్తి పోసి పరుగెత్తి పోయిన వారూ ఉన్నారు. అదంతా ప్రారబ్ధ విలాసం. ప్రజ్ఞాన నిరాసం కాదు.

క్షిప్రం భవతి ధర్మాత్మా - శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి కౌంతేయ ప్రతి జానీహి న మే భక్తః ప్రణశ్యతి - 31

  అంతేకాదు. అలా దురాచారుడుగా కనిపిస్తున్నా క్షిప్రంభవతి ధర్మాత్మా. ఉన్నట్టుండి ధర్మాత్ముడయి లోకులకు కనిపించినా ఆశ్చర్యం లేదు. ఇది లోకుల దృష్టికే సుమా ఈ మార్పు. వాడి దృష్టిలో మాత్రమెప్పుడూ

Page 254

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు