మళ్లీ శ్లోకం దగ్గరికి వస్తే మనం - వారు తనలో ఉన్నారే గాని వారిలో తాను లేడు. అంటే వారిలో ఆయన పరమాత్మ అనే గొప్ప భావం లేదు. మమ వర్క్ష్మాను వర్తంతే మనుష్యాః అని కూడా ఇంతకు ముందొక మాట వచ్చింది. సర్వ వ్యాపకమైన తత్త్వం కాబట్టి పరమాత్మలో సర్వులూ ఉంటారు. అది వస్తు సిద్ధం. కాని ఆ భావన వారిలో కూడా ఉండాలి గదా. ఉంటే మంచిదే. అది బుద్ధి సిద్ధమయి జ్ఞాను లని పించుకొంటారు. లేకుంటే మాత్రం అజ్ఞానులే. ఆయనకు దూరస్థులే. కంస శిశుపాలాదుల లాగానే కాదు. గోపగోపికా ధర్మజ భీమాదుల లాగా కూడా. వారూ జ్ఞానులు కాదు గదా. ఇదీ పరిష్కారం.
అపిచే త్సు దురాచారో - భజతే మా మనన్య భాక్
సాధు రేవస మంతవ్యః - సమ్య గ్వ్యవసితో హిసః - 30
ఇంకా ఒక మాట. భక్తి అంటే అనన్యమైన భక్తే భక్తి. అది భక్తి గూడా గాదు జ్ఞానమే నని పేర్కొన్నాము. జ్ఞాని ఎప్పుడూ సదాచారంతోనే బ్రతుకుతుంటాడు వాడి జీవితంలో. అయితే ఒకప్పుడు ప్రారబ్ధ కర్మ ప్రాబల్యం కొద్దీ వాడి ఆచారంలో తేడా కనపడవచ్చు లోకానికి. అది లోకదృష్టికే గాని వాడి దృష్టికి కాదనే సత్యం గుర్తుంచుకోవాలి మనం. అపి చే త్సు దురాచరో కుత్సితమైన మార్గంలో నడుస్తున్నట్టుగా కనపడవచ్చు వాడు. భజతే మా మనన్యభాక్ - కాని వాడు నన్నెప్పుడూ తన కనన్యంగా భావిస్తుంటాడు భజిస్తుంటాడు. కనుక వాడు జ్ఞానే. అజ్ఞాని
Page 253