చేస్తుంటారు మానవులు. వారే శిశుపాలాదులూ జరా సంధాదులూ. వారందరూ కృష్ణ పరమాత్మతో కలిసి మెలిసి తిరిగినవారే. కాని ఆయన భగవత్తత్త్వమేదో గుర్తించ లేకపోయారు. జారుడని చోరుడని ఇష్టం వచ్చినట్టాడి పోసుకొన్నారు. అలాటి పిదప బుద్ధి లేని అక్రూరాది సాధుజను లంతా ఆయన మహానుభావుడని కీర్తించారు. ఇంకా కుచేలాదులైతే ఆయనను తమ కనన్యంగా ఆత్మ స్వరూపంగానే భావించారు. తమ బుద్ధికి తోచినట్టు వారా తత్త్వాన్ని భావించటం మూలాన్నే పరమాత్మ కొందరిని అనుగ్రహిస్తున్నట్టు మరికొందరిని నిగ్రహిస్తున్నట్టు కనిపిస్తూ వచ్చాడు. ఇది వారి బుద్ధిదోషమే గాని అక్కడ వస్తు దోషం కాదు.
ఇక్కడ ఒక చక్కని దృష్టాంత మిచ్చారు భాష్యకారులు. అగ్నివదహమ్ ద్రష్టవ్యః దూర స్థానాం యధా అగ్నిః శీతం నా పనయతి - సమీప ముప సర్పతా మపనయతి తధా అహం భక్తా నను గృహ్లామి - నేతరాన్. చలికాలంలో తరుచుగా భోగిమంటల లాంటివి వేసుకోట మలవాటు మానవులకు. అది వారి చలిని పోగొడుతుంది. సందేహం లేదు. కాని దగ్గరగా కూచున్న వాడికైతే పోగొడుతుంది గాని దూరదూరంగా కూచున్న వారికెలా పోగొడుతుంది. అది అగ్ని అపరాధం కాదు. ఆ కూచునే వారిదే. అలాగే నన్నూ చూడండంటాడు పరమాత్మ. నాకు దగ్గరగా వచ్చేవారే నా భక్తులు. అలాకాక దూరమైపోతే నా తప్పేముంది. వారు భక్తులు గారు. విభక్తులు. నా అవసరమే లేదనే వారికి నేనేమి చేయగలను. ఎంతెంత
Page 251