పెడుతున్నది. నన్ను భక్తితో ఎవరిలా భజిస్తారో వారికి కలిగే ఫలితమేమిటో తెలుసా. వారు నాలోనూ నేను వారిలోనూ ఉంటానంటున్నాడు. ఏమిటర్ధం. సర్వవ్యాపకు డన్నప్పుడీ మాట క్రొత్తగా చెప్పాలా. తనలో సమస్తమూ తాను సమస్తంలోనూ ఉండకపోతే సర్వమూ ఎలా వ్యాపిస్తాడు. అదిగా దర్ధం. మరేమిటి. వారిలో తానుండట మంటే పరమాత్మ సర్వవ్యాపకుడనే భావం వారి మనసులో ఏర్పడట మని. మరి వారు తనలో ఉండటమంటే అలాటి భావంతో నిండిపోతే వారే పరమాత్మ స్వరూపులు కాబట్టి పరమాత్మగా వారూ సర్వత్రా ఉంటారని. ఇంతకూ నేనే పరమాత్మననే జ్ఞాన ముండటమే పరమాత్మ జ్ఞానులలో ఉండటమైతే అలాటి జ్ఞానులందరూ పరమాత్మ కన్యం కాదని చెప్పటమే వారందరూ మరలా పరమాత్మలో ఉండటం. అప్పటి కాత్మ జ్ఞానికీ పరమాత్మకూ తేడా లేదని చెప్పినట్టయింది. జ్ఞానీ త్వాత్మైవ మేమతం అని ఇంతకు ముందే ప్రకటించాడీ సత్యాన్ని తానే స్వయంగా.
ఇంతకూ పరమాత్మలో ఏమీ లేదు దోషం. ఏదైనా ఉంటే గింటే మానవుడి బుద్ధిలోనే ఉంది. ఈశా వాస్య మిదమ్ సర్వమన్నట్టు మన బుద్ధి ఈశ్వర వాసనా వాసిత మైతే చాలు. సృష్టి అంతా ఈశ్వరాకారంగానే భాసించి ఎక్కడా మనకు వైషమ్యం కనిపించడు. అప్పుడాయన ఒకరి నను గ్రహిస్తున్నాడని ఇంకొకరిని నిగ్రహిస్తున్నాడని అభియోగం Com-plaint చేయబోము. అలా కాని పక్షంలోనే ఇలాటి మిధ్యాభియోగం
Page 250