#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

అంటే ఉండటమనే స్ఫురణ. అలాటి స్ఫురణ లేని పదార్ధమేముంది చెప్పండి. ప్రతి ఒక్కటీ అది చేతనమే గావచ్చు. అచేతనం కావచ్చు. ఉంది ఉందనే భావంతోనే గదా చూస్తుంటాము. ఆ ఉందనే చూపుతో చూడకపోతే ఏదైనా ఉందో లేదో నీకేమి తెలుసు. దాని అస్తిత్వానికి ప్రమాణ మేమిటి Proof or certitude. ప్రమాణం లేకుండా ప్రమేయానికి అస్తిత్వమే లేదు. కాబట్టి సర్వత్ర పరమాత్మ ఉండవలసిందే. ఉండట మనేది నిరాకారం కాబట్టి సమానంగా ఉండాలది. అది కేవల ముండటమే అయితే జడం. ఉన్నాననే స్ఫురణ కూడా కాబట్టి చేతనం కూడా అయి ఉండాలి. చేతనమైతే దానికి రాగద్వేషా లుంటాయేమో ననే అనుమాన మేర్పడవచ్చు మనకు. కాని చేతనమైనా అది జీవుడిలాగా ఏ ఒక్క ఉపాధికో పరిమిత మయింది కాదు. సర్వ వ్యాపకం. కనుక వీడు తనవాడని వాడు పరాయివాడనే రాగద్వేషాల కవకాశ మేమాత్రమూ లేదు. అలాగైతేనే అది సర్వవ్యాపకం సమానమనే మాటల కర్ధముంటుంది.

  ఇంతవరకూ నడిచింది శ్లోకంలో పూర్వార్ధం. పూర్వార్ధం వరకూ భగవానుడు వస్తుసిద్ధంగా తానుగా మనకు చెప్పుకొనే మాట. నిర్దోషంహి సమం బ్రహ్మ అని ఇంతకు ముందే పేర్కొన్నట్టు తనవరకూ పరమాత్మ సర్వసముడే. అందులో ఏ పక్షపాతాది దోషమూ లేదు. పోతే వస్తుసిద్ధమైన ఆ తత్త్వాన్ని అలాగే బుద్ధి సిద్ధం చేసుకో గలిగితే వారు నిజమైన జ్ఞానులు. అలాటి జ్ఞానుల విషయ మిప్పుడు శ్లోకంలో ఉత్తరార్ధం మనకు బయట

Page 249

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు