అని రెండుసార్లు మోక్షమనే మాట వచ్చింది. అందులో మొదటిది జీవన్ముక్తి. రెండవది విదేహముక్తి అని అర్ధం చేసుకోవాలి మనం. విముక్తశ్చ విముచ్యతే అనే ఉపనిష ద్వాక్యానికిది వ్యాఖ్యానం.
సమోహం సర్వ భూతేషు - నమే ద్వేష్యోస్తి న ప్రియః యే భజంతి తుమాం భక్త్యా మయితే తేషు చాప్యహమ్ - 29
ఇక్కడ ఒక ప్రశ్న వస్తున్న దిప్పుడు. భగవానుడు సర్వవ్యాపకుడు గదా. సర్వమూ ఆయన స్వరూపమే గదా. అలాంటప్పుడు వీడు జ్ఞాని వాడు అజ్ఞాని అని చెప్పి ఏ కొద్దిమందికో ఆయన అనుగ్రహం చూపటమేమిటి. తనకు భక్తులు కారని చెప్పి మిగతా వారి నందరినీ తనకు దూరం చేయట మేమిటి. భక్తుడేమి టభక్తుడేమిటి. అందరినీ ఒకేలా అనుగ్రహించవచ్చు గదా అని ఆక్షేపణ. దీనికాయనే ఇస్తున్నాడిప్పుడు సమాధానం వినండి.
సమోహం సర్వభూతేషు. చరాచర పదార్థా లన్నింటిలోనూ నేను సమానంగా వ్యాపించి ఉన్నాను. నమే ద్వేష్యోస్తి నప్రియః నా కొకడు అనిష్టుడని మరొకడు ఇష్టుడనే తేడా లేదు. కాని యే భజంతి తు మాం భక్త్యా. ఎవరైతే నన్ను భక్తితో భజిస్తారో. వారు నాలో ఉంటారు. తేషు చాప్యహం. వారిలో కూడా నేనుంటాను. ఇదీ ఆయన మాట. శ్లోకాని కున్నదున్నట్టు చెబితే ఇదీ అర్ధం.
అయితే ఏమర్ధయింది మనకు. అన్ని పదార్థాలలో పరమాత్మ సమానంగా ఉన్నాడంటే అర్థమేమిటి. పరమాత్మ అంటే సచ్చిత్తులు
Page 248