#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

గంగానది సముద్రంలో కలిస్తే ఏమవుతుంది. గంగ పోయి సముద్రం మిగులుతుంది. అలాగే ఇదీ. త్యాగేనైకే అమృత త్వ మానశుః అని ఉపనిషత్తు చాటటంలో ఆంతర్యమిదే. ఇంతకూ పత్ర పుష్పాదులనేది ఒక సంకేతం. తద్ద్వారా మనం గ్రహించ వలసింది మన జీవోపాధి. ఉపాధి ప్రవిలాపనమే ఇక్కడ వివక్షితమైన సత్యం.

యత్కరోషి యదశ్నాసి యద్దదాసి జుహోషియత్
యత్తపస్యసి కౌంతేయ- తత్కురుష్వ మదర్పణమ్ - 27


  అంతే కాదు. ఒక్క పత్ర పుష్పాదులనే కాదు. అసలు నీవే పని చేసినా సరే. అది మనసా వచసా వ పుషా ఏ దైనా సరే. యత్కరోషి ఏది చేస్తున్నా. యదశ్నాసి ఏది తింటున్నా అనుభవిస్తున్నా. యజ్ఞుహోషి. ఏది నీవు అగ్నిహోత్రంలో హోమం చేస్తున్నా. యత్తపస్యసి. ఆఖరు కేది తపస్సని చెప్పి నీవాచరిస్తున్నా సరే. అదంతా నీవా దేవతకో ఈ దేవతకో నని గాదు. కనీసం నీకోసమని కూడా కాదు నీవు భావించ వలసింది. నీవు భావించవలసిందీ సమర్పించ వలసిందీ తత్కురుష్వ మదర్పణం. నాకే సుమా అని హెచ్చరిస్తున్నాడు. నాకంటే ఇక్కడ పరమాత్మ కని అర్ధం. పరమాత్మ అన్నప్పుడది సర్వే సర్వత్రా సమానంగా వ్యాపించి ఉంది. అదే జీవాత్మ. అదే దేవతాత్మ. అదే జగదాత్మ కూడా. ఒక్కమాటలో చెబితే సర్వాత్మ. అలాటి దానికొకటి అర్పిస్తున్నా మని మాటే గాని అర్పించే వారెవరు. అర్పించే పదార్ధమేది. అర్పణ నందుకొనే వాడెవడు. అంతా ఒక నటన. అలా నటనగా భావించి ఏ పని చేసినా అది పనే గాదు. ఇదే అద్భుతమైన

Page 246

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు