#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

గదా అటుకులు పరమాత్మ కర్పించాడు. పరమాత్మ కూడా వాటి నటుకులని గాక ఆత్మ స్వరూపంగానే గదా భావించి ఆయన ననుగ్రహించాడు.

  అలా కాక అన్యంగానే వాడు భావించి ఆ పని చేశాడో అది వాడికి చెందదా ఫలం. ఎందుకంటే వాడిదిగాదా సొమ్ము. పత్రంగాని పుష్పంగాని ఫలంగాని - ఫలరసం గాని- ఇవి నాలుగూ వాడెక్కడి నుంచి తెచ్చాడు. చెట్టు నడిగి చేమనడిగి. తస సొమ్ము కాదు గదా అది. చెట్ల సొమ్ము. చెట్ల సొమ్ము పరమాత్మకు సమర్పిస్తే ఎవరికి రావాలా ఫలితం. చెట్లకే. వాడికి గాదు. వాడి సొమ్మేదైనా ఇస్తే వాడికి దక్కుతుంది ఫలం. కాబట్టి ఇది పత్రమిది వృక్షం వల్ల సంపాదించి తెచ్చాను. ఇదుగో దీని నా పరమాత్మకు నివేదిస్తున్నాను అని ఇలా తనకూ వృక్షాదులకూ పరమాత్మకూ భేదం చూచి చేసే ఆరాధన అన్యమే గాని అనన్యమెలా అవుతుంది. కాకుంటే అది జ్ఞానమెలా అవుతుంది. సగుణమైన దేవతారాధనే. మరి నిర్గుణమైన ఆరాధనగా ఎలా మారుతుందది అని అడిగితే దాన్ని కొంచెం లోతుకు దిగి చెప్పుకోవాలి మనం.

  పత్రమంటే శరీరం. పుష్పమంటే మనస్సు. ఫలమంటే మనో వ్యాపారాలు. తోయమంటే వాటివల్ల కలిగే సుఖదుఃఖాది ద్వంద్వాలు. ఇవి నాలుగూ నేనేనని అభిమానించటమే జీవభావం. ఇదుగో వీటిని పరమాత్మకు ధారాదత్తం చేయాలి. అలా చేయగలిగితే నీ స్వార్ధాన్ని నీవు త్యాగం చేసిన ట్టవుతుంది. అర్థాత్ జీవజ్ఞానాన్ని వదులుకొన్న ట్టవుతుంది. జీవభావం పరమాత్మ కర్పిస్తే ఇక మిగిలిపోయిం దేమిటి. పరమాత్మ భావమే.

Page 245

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు