అన్యం కాదు. ఎక్కడో లేదు. సమస్త ప్రపంచమూ వ్యాపించి ఉన్న తత్త్వమది. స్థావర జంగమాత్మకమైన సృష్టి అంతా అదే అయినప్పుడు దానికేది సమర్పిస్తావు. ఎలా సమర్పిస్తావు. అలా చేసినా నీవు దాని సొమ్ము దానికే సమర్పించిన ట్టవుతుంది. కనుక నీవు ద్రవ్యరూపంగా సమర్పించ నక్కర లేదు దానికేదీ. మరెలాగా. ఏది ఇచ్చినా ఆయన సొమ్మే ఆయనకు సమర్పిస్తున్నాను నాదంటూ ఏదీ లేదు దానికన్యంగా ననే భావనతో సేవించాలి. అంతా ఆత్మేననే భావనే దానికి నీవు చేసే సమర్పణ.
ఆ భావన ఒకటుంటే చాలు. దానితో నీవేదైనా నివేదించవచ్చు పరమాత్మకు. అందులో హెచ్చు తగ్గులు లేవు. పరమాత్మ కన్యంగా ఏదీ లేదన్నప్పు డిక న్యూనాధిక భావమెలా ఉంటుంది. కనుక పత్రం పుష్పం ఫలం తోయం. పత్రమూ పుష్పమూ ఫలమూ తోయమనే తేడా చూడనక్కర లేదు. అంతా ఒకటే ఆయన దృష్టిలో. నీ దృష్టి కూడా అలాగే ఉండాలి. అదే అసలైన భక్తి. యే మో భక్త్యా ప్రయచ్ఛతి. ఇలాటి అనన్య భక్తి భావనతో ఎవడలా సమర్పిస్తాడో - తదహం భక్త్యుపహృతం - అది వాడు పత్రపుష్పాది పదార్ధాలని గాక భక్తి అనే ముద్ర వేసి వాటిని సమర్పించాడు కాబట్టి అశ్నామి ప్రయతాత్మనః - అది నేను తప్పకుండా స్వీకరిస్తాను. కారణం వాడు ప్రయతాత్ముడు. ఆత్మంటే ఏమిటో తెలిసి దాన్నే పట్టుకొని కూచున్నాడు. పత్ర పుష్పాదులైన అనాత్మలు వాడికి కనిపించటం లేదు. అవి కూడా వాడికాత్మే. వాటి ద్వారా ఆరాధిస్తున్న నేనూ వాడికాత్మేనని చెబుతున్నాడు పరమాత్మ. భాగవతంలో కుచేలుడ లాటి ఆత్మ భావంతోనే
Page 244