#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

గాక పోయినా మధ్యమం. పోతే అది కూడా కాక అధమమైన సాధన ఒకటున్నది. భూతాని యాంతి భు తేజ్యాః - వినాయక మాతృగణ చతుర్భగి న్యాదులైన క్షుద్ర దేవతలను పట్టుకొని తద్వరా ఏవో సిద్ధులు పొందుదామని చూచేది. అలాటి సాధన చేసే వారందరికీ క్షుద్ర దేవతా ప్రాస్తే. అంతకన్నా ఎక్కువ లేదు. ఇవి మూడూ కాని దొక్కటే ఉంది నాలుగవది. అది ఉత్తమోత్తమమైన మార్గం. అక్కడ దేవతలు లేరు. పితరులు లేరు. క్షుద్ర దేవతలూ లేరు. అదంతా అజ్ఞాన క్షేత్రంలో జరిగే వ్యవహారం. పోతే ఇది అజ్ఞానం కాదు. పరిపూర్ణమైన జ్ఞానక్షేత్రం. ఇక్కడ ఆత్మానాత్మలనే తేడా లేదు. అంతా ఆత్మస్వరూపమే. అదే నిత్యమూ దర్శిస్తుంటాడు జ్ఞాని. కాబట్టి యాంతి మద్యాజినోపి మాం వారు నన్నే పొందుతారని చాటుతున్నాడు భగవానుడు. ఆ ముగ్గురిదీ అన్యమైతే జ్ఞానిది అనన్యం. వారి కల్పఫలమైతే ఇతనికి మోక్షమనే మహా ఫలమే లభిస్తుంది.

పత్రం పుష్పం ఫలం తోయం - యోమే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుప హృత - మశ్నామి ప్రయతాత్మనః - 26


  అంతేకాదు. దేవతారాధన కంటే నా ఆరాధనలో ఒక గొప్ప సౌలభ్యం కూడా ఉందంటాడు. దేవతలు నీ కంటే అన్యులు చాలా గొప్పవారనే భావంతో చూస్తుంటావు కాబట్టి వారికెక్కడ లేని కానుకలు సమర్పించుకోవాలి. ఆహుతులు పెట్టాలి. కాస్తా కూస్తా నివేదిస్తే ఒప్పుకోరు. నీవు కోరిన వరాలు తక్కువైతే గదా వారు తక్కువ పెడితే సంతోషించటానికి. కోరినంత సమర్పించిగాని ఫలితం పొందలేవు. మరి పరమాత్మ నీకు

Page 243

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు