యాంతి దేవ వ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః
భూతాని యాంతి భూతేజ్యా - యాంతి మద్యాజి నోపి మామ్-25
కాని ఇలాటి మహోన్నతమైన జ్ఞానానికి నోచుకోలేదు ముప్పాతిక మువ్వీసం జనాభా. ఏమి చేస్తాం. పురాకృత దుష్కృత పరిపాకమది. కనీసం ఈ జన్మలోనైనా అలాటి ప్రయత్నం లేదు వారికి. వారికి కనిపించే దంతా ఇహమూ పరమూ ఇవి రెండే. ఇవి రెండూ ఆభాస. వాస్తవంగా ఉన్నదీ రెండింటి బదులూ ఆత్మ స్వరూపమేనని తెలియదు వారికి. అజ్ఞానులు వారు. అజ్ఞానంలో ఆత్మే వారి కనాత్మగా భాసిస్తున్నది. ఆత్మను మరచిపోయి అనాత్మరూపమైన దేవతలనే వాస్తవమని భావిస్తే ఆత్మ ఎలా కనిపిస్తుంది వారికి. అజ్ఞాని విషయ మిదైతే జ్ఞాని కలా కాదు. అనాత్మ భూతమైన ఈ దేవతలు గాక వారి స్థానంలో అంతా ఆత్మగానే కనిపిస్తుంటుంది. వారికి కనిపించిన దేవతలను వారారాధించి తత్ఫలితంగా దేవభోగా లనుభవించి అక్కడికే తృప్తి పడుతుంటే వీరా పరా దేవతనే అసలైన తత్త్వంగా పట్టుకొని తమ కనన్యంగా భజిస్తారు కాబట్టి ఆత్మ సామ్రాజ్యానికే నిత్యానంద మనుభవిస్తారు. అభిషిక్తులై
అదే ఇప్పుడు వర్ణిస్తున్నాడు భగవానుడు. యాంతి దేవవ్రతా దేవాన్. దేవతా రాధనే వ్రతంగా పెట్టుకొన్నా వారా దేవతా సాయుజ్యమే పొందుతారు. పితౄన్ యాంతి పితృవ్రతాః పితృ దేవతలని కొందరున్నారు పితృ లోకంలో. అగ్నిష్వాత్తుడు మొదలైనవారు. వారి నారాధిస్తూ పోతే మరణానంతర మా లోకానికే వెళ్లుతారు. మొదటిది ఉత్తమమైతే ఇది ఉత్తమం
Page 242