#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

  అదైనా ఎలాగంటే - అహం హి సర్వయజ్ఞానం భోక్తా చ ప్రభు రేవచ - నీవెవరిని గురించి ఏ యజ్ఞం యాగం చేసినా దానికి భోక్తనూ ప్రభువునూ నేనే. ఆయా దేవతలు కారు తెలుసుకో. అవి నా ఆ భాసలే కాని నా స్వరూపం కాదు. ఆ రూపాలు ధరించి మీకు నేను ఇంద్రాది దేవతలుగా దర్శన మిస్తుంటాను. మీకు వాస్తవంలో యజ్ఞవల మందజేస్తున్నదీ - అందించే సామర్థ్యమున్న వాడను నేనే సుమా - అని హెచ్చరిస్తున్నాడు మనలను. ఇంకా ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నాడది ఏమో తెలుసా. నతు మా మభిజానంతి తత్త్వేన - ఉపాసకులైన మీరందరూ నన్ను ఇంద్రాది దేవతలని అన్యంగా చూస్తున్నారే గాని నన్ను నన్నుగా గుర్తించటం లేదు. గుర్తిస్తే ఇంద్రాదులు మీకు కనిపించరు. వారి లోకాలూ వ్యవహారమూ కనిపించేది గాదు. వాటన్నిటి స్థానంలో అఖండమైన నా స్వరూపమే మీ స్వరూపంగా మీకు దర్శనమిచ్చేది. ఇదే ఆత్మజ్ఞానమంటే. ఇలాటి తత్త్వ జ్ఞానం మీకు లేదు. అందుకే చ్యవంతి తే. జారిపడుతున్నారు పాసకు లందరూ. స్వర్గానికి పోయినా జారుపాటు తప్పదు. అదేగదా గతాగతం లభంతే అని ఇంతకు ముందే చీవాట్లు పెట్టాడు. అలా జారిపడటం వల్లనే సదసద్భావాలూ మర్త్యా మృతభావాలూ ఇలాటి ద్వంద్వాలన్నీ వచ్చి నెత్తిన పడ్డాయి మానవులకు. అవి తప్పించుకోవాలంటే పరమాత్మను దేవతా రూపాలుగా కాదు. దేవతాదికమైన అనాత్మ ప్రపంచాన్నంతా ఏకైకమైన ఆత్మ స్వరూపంగా దర్శించ గలిగి ఉండాలి. అదే జ్ఞానం. అప్పుడిక లోకాంతరాలూ జన్మాంతరాలూ అనే ప్రసక్తే లేదు. అన్నిటికీ తెర దించిన ట్టవుతుంది.

Page 241

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు