#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

చేస్తున్నారు. అని భగవానుడి సమాధానం. విధి అంటే కర్మ - కర్మ కానిది జ్ఞానమని గాదిక్కడ అర్ధం. శాస్త్రం విధించిన ఏ బ్రహ్మ జ్ఞానముందో అది లేకపోవటమే అవిధి. అంటే అజ్ఞానమని భగవత్పాదుల వ్యాఖ్యానం. మరి ఇలాటి అజ్ఞానం దగ్గర పెట్టుకొని ఊరేగుతున్నంత వరకూ అన్యంగా కాక అనన్యంగా ఎలా కనపడుతుందా తత్త్వం. వస్తుతః అనన్యమైనా మన బుద్ధి దోషాన్ని బట్టి అన్యమైన ఆయా దేవతా మూర్తులుగానే భాసిస్తుంది. వస్తు దోషం కాదిది. మానవుడి బుద్ధి దోషం. అయినా వస్తువే ఆయా రూపాలలో భాసిస్తున్నది గనుక. ఆ భాసను పట్టుకొన్నా ఆమేరకు అంతో ఇంతో ఫలితాన్ని మనకది అందిస్తుంది. అందులో సందేహం లేదు.

అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభు రేవచ నతు మా మభి జానంతి - తత్త్వేనాత శ్శ్యవంతి తే - 24

  అంతో ఇంతో అందిస్తుందంటున్నారు - ఇంత కష్టపడి మేమారాధిస్తే మాకు కలిగే దీమాత్రమేనా అని అడిగితే జవాబిస్తున్నాడు. మతెంతో గతెంత అన్నట్టు మీరే భావనతో పట్టుకొంటే అంతమాత్రమే గాక అధికమైన ఫలమెలా అబ్బుతుంది. అనన్యంగా అఖండంగా పట్టుకోలేదు గదా మీరు నన్ను - అఖండమైన మోక్ష ఫలమే నేను మీకు ప్రసాదించటానికి. అయినా ఆమాత్రమైనా మీకు అందజేస్తున్నా నంటే సంతోషించండి. అసలే నన్ను వదిలేయకుండా దేవతా మూర్తులుగానైనా పట్టుకొని ఆరాధిస్తున్నారు. కాని అవి నా విభూతి శకలాలేగాని సకలమైన నా స్వరూపం కాదు గదా. అందుకే పరిమితమైన ఫలమే మీకు అందజేస్తున్నానని జవాబిస్తున్నా డాయన.

Page 240

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు