సొమ్ములుగా పట్టుకొంటున్నా మనం వాస్తవంగా పట్టుకొంటున్నది బంగారమే. అయితే బంగారమనే భావన లేదు. భావన లేకపోయినా మన చేతికి వస్తున్నది సువర్ణమే. మహా అయితే ఆభరణాల రూపంలో.
అలాగే ప్రస్తుత మింద్రాది దేవతలుగా ఆరాధిస్తున్నారంటే ఉపాసకులు వీరారాధిస్తున్నది ఇంద్రాదులను కాదు. ఇంద్రాది దేవతల రూపంలో కనిపిస్తున్న ఆ పరమాత్మనే. పరమాత్మ అనే బుద్ధి లేదు. కాబట్టి వస్తుతంత్రమైనా అది వీరికి బుద్ధి తంత్రం కావటం లేదు. బుద్ధి తంత్రమైతే గాని అది అనుభవం కాదు. కాని వీరి కనుభవానికి రాకపోయినా అక్కడ ఉన్నది పరమాత్మ తత్త్వమే కాబట్టి వీరి ఆరాధన పరమాత్మకే చెందుతున్నది వాస్తవంలో. అదే బోధిస్తున్న దిప్పుడు గీత. యేష్యన్య దేవతా భక్తాః యజంతే శ్రద్ధయా న్వితాః - ఇంద్ర వరుణాదులైన ఆయా దేవతలే మన కవీ ఇవీ ఇస్తారని ఎంతో శ్రద్ధాభక్తులతో మానవులు వారి నారాధించవచ్చు. కాని అది వారి భావనే కేవలం. దేవతలను కాదు నిజంలో వారారాధిస్తున్నది. మరి ఎవరినంటారు. తేపి మా మేవ కౌంతేయ యజంతి. వారు నన్నే ఆరాధిస్తున్నారు వేరెవరినీ కాదంటున్నాడు పరమాత్మ. కాసుల దండను పట్టుకొన్నా బంగారాన్నే పట్టుకొన్నా డన్నట్టు బ్రహ్మాది దేవతల నారాధిస్తున్నా అది పరమాత్మ నారాధించటమే. కాని బంగారమనే దృష్టి లేనట్టే పరమాత్మ అనే దృష్టి లేదు. బంగారమే కాసుల దండ అని చూచినట్టే - పరమాత్మనే దేవతలని చూస్తున్నారు. అంత మాత్రమే. అయితే ఎందుకలా చూస్తున్నారీ ఉపాసకులు. ఎందు కేమిటి. అవిధి పూర్వకం. అజ్ఞానం వల్ల చూస్తున్నారు.
Page 239