#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

చూస్తే మనం తప్పించుకోగల మీ బంధం నుంచి అంత మాత్రమే. అందుకే మొదట సమస్య ఏమిటో చెప్పి దానికి పరిహారం వర్ణించి చెబుతున్నది గీత. అనన్యా శ్చింతయంతో మాం. నన్ను మీకు అన్యమని గాక అనన్యంగా భావించండని సలహా ఇస్తున్నది. అంటే ఏమన్నమాట. ఆయా దేవతలుగా గాక దేవలోకాలుగా గాక యజ్ఞయాగాది క్రియలుగా గాక అన్నీ కలిపి ఏకం చేసి నా స్వరూపంగా దర్శించండి మీరు. అప్పుడిక జనన మరణాలనే ద్వంద్వాలు అన్యంగా కనిపించవు. అవి కూడా సచ్చిద్రూపంగా దర్శనమిస్తాయి. దానికిక వ్యభిచారం Change లేదు. అని మనకు నిత్యసత్యమైన ఆత్మతత్త్వాన్ని బోధిస్తున్నది శాస్త్రం.

  అది కూడా కేవలం సిద్ధాంత మనుకోకండి. దృష్టాంతం చేసుకోండి జీవితంలో. యే జనాః పర్యుపాసతే. ఎవరైతే అలా నిత్యమూ పర్యుపాసన చేస్తారో అంటున్నది. మామూలు ఉపాసన గాదు. పర్యుపాసన. పరితః సమంతాత్. ఉప సమీపే ఆసనం. స్థితిర్మనసః - పైనా క్రిందా ప్రక్కలా లోపలా వెలపలా - అనే తేడా లేకుండా ఎటు చూస్తే అటు ఏది బడితే అది నీకు అన్యంగా కనిపించ గూడదది. అనన్యంగానే దాన్ని చూస్తూ ఆత్మ స్వరూపంగానే దర్శిస్తూ పోవాలి. అప్పుడు శాస్త్రం కాదది. జీవితమే అవుతుంది మీకని హామీ ఇస్తున్నది. అలా ఎవరు జీవితంగా మలుచుకొంటారో తేషాం నిత్యాభియుక్తానాం. నిత్యాభియుక్తులు వారు ఎప్పుడూ అదే లోకంగా బ్రతుకుతుంటారు. ఇక వారి కిహం లేదు. పరం లేదు. జీవితం మరణమనే తేడా లేదు. అంతా తమ ఆత్మ స్వరూపంగానే అనుభవానికి వస్తుంటుంది.

Page 236

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు