#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము



   కాని దాన్నే వాస్తవమని చూస్తున్నారు వీరంతా. అందుకే సదసత్తులుగా మృతామృతాలుగా కనిపిస్తున్నాదా పరమాత్మే వీరి మనస్సులకు. అందుకే ఇది అసత్తీలోకం - అది సత్తు ఆదేవ లోకాదులన్నీ - ఇక్కడ మరణం తప్ప అమృతత్వం లేదు అక్కడికి వెళ్లితే అమరత్వం కొట్టేయవచ్చు. దానికి సాధన మీ సత్కర్మానుష్ఠానమే నని మహాభ్రాంతిలో పడిపోతున్నారు. అది వారి భావనే గాని వాస్తవం కాదు. కాదని చెప్పటానికే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లినా సుఖం లేదు. మూన్నాళ్ల ముచ్చటే అది - అక్కడి నుంచి మళ్లీ వచ్చి ఇక్కడ పడవలసిందే నని మొహం వాచేట్టు చీవాట్లు పెడుతున్నాడు భగవానుడు. ఇది అసత్తు అది సత్తని చూచినా తప్పే. ఇది మృతం అది అమృతమని చూచినా తప్పే. సదసత్తులు రెండూ నా స్వరూపం. మృతా మృతాలు రెండూ కూడా నా స్వరూపంగా చూడమని చెబుతున్నా డొక పక్క అలా చూస్తే అది సామాన్య దృష్టి. దానికిక ఇది సత్తు ☺යි అసత్తనే విశేష భావన లేదు. మృతామృతాలనే విశేష చింతన లేదు. విశేషాలన్నీ సామాన్యంలో కలిసిపోయి ఏకంగా దర్శనమిస్తాయి. ఇస్తే అది ఎప్పుడూ సత్తే. ఎప్పుడూ అమృతమే. అది జ్ఞానం వల్లనే రావాలా అనుభవం. అలాటి జ్ఞానం లేనంతవరకూ ఈ ద్వంద్వ యాత్ర తప్పదు. ఈ జనన మరణాల పాలు గాక తప్పదు.

  ఈ సత్యాన్నే ఇప్పుడీ రెండు శ్లోకాలూ మనకు తేటతెల్లంగా చాటుతున్నాయి. త్రైవిద్యాః అంటే మూడు వేదాలూ పట్టుకొని వేలాడేవారు. సోమపాః పూత పాపాః సోమపానం చేసి పవిత్రుల మయ్యామని

Page 233

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు