#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

ఋగాదులైన వేదాలనుండి. చచ్చిన తరువాత ఆ పూజాఫల మనుభవించ టానికీ సోమయాజలుగారు చేసే పరలోక యాత్రలనండి. అక్కడ వీరనుభవించే దివ్యభోగా లనండి. ఇదంతా మానవుడి అజ్ఞానమే గాని జ్ఞానం కాదు. అందుకే అవిద్యావ ద్విషయత్వం నాతి వర్తంతే సర్వే విధయ స్సర్వాణిచ ప్రమాణాని అని కుండబద్దలు కొట్టి చాటించారు భగవత్పాదులు.

  ఇలాటి అజ్ఞానమే పరమ పామరంగా బతికే లోకుల దగ్గరి నుంచీ మహా మేధావంతుల మని విర్రవీగే శాస్త్రజ్ఞుల వరకూ రాజ్యం చేస్తున్నది. వారి ఆలోచనలూ - మాటలూ - చేతలూ - అన్నీ అజ్ఞాన విలసితాలే. అజ్ఞానం వదలకనే ఏకంగా అభిన్నంగా కనిపించ వలసిన ఆత్మ తత్త్వం వారికి అనేకంగా చెదిరిపోయి వేద వేదాంగాలుగా అవి చేసే బోధలుగా తదనుగుణంగా తామాచరించే యజ్ఞాది కర్మలుగా తత్ఫలితంగా తాము పొందే ఆయా దేవలోకాలుగా వాటి కధిపతులైన దేవతలుగా దర్శనమిస్తున్నది. ఇది అసలా నకలా మీరే ఆలోచించండి. ఒక వంద అద్దాలు చుట్టూ పెట్టుకొని చూస్తే మనమే వంద రూపాలలో కనిపిస్తామా లేదా. అలా కనిపించిన మాత్రాన మనం వంద శరీరాలుగా మారిపోయామా. శరీరం ఒకటే. అదే వస్తువు. మరి ఆ కనిపించేవి. దాని ఆ భాసలు. అలాగే అసలైన ఆత్మ తత్త్వ మొక్కటే. అదే సమ్యగ్దృష్టితో చూస్తే సర్వవ్యాపకంగా ఏకంగా దర్శన మిస్తుంది. అలా కాక విషమమైన దృష్టితో చూస్తే వివిధ రూపాలలో కనిపించక ఏమవుతుంది. అలా కనిపించినంత మాత్రాన అది వాస్తవ మవుతుందా.

Page 232

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు