త్రైవిద్యామాం సోమపాః పూతపాపాః
యజ్ఞేరిష్ట్వా స్వర్గతిం ప్రార్ధయంతే
తే పుణ్య మాసాద్య సురేంద్ర లోక
మశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ 20
తే తం భుక్త్వా స్వర్గ లోకం విశాలం
క్షీణే పుణ్యే మర్త్య లోకం విశంతి
ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్నా
గతాగతం కామ కామా లభంతే - 21
ఎందుకంటే వివేక జ్ఞానమే మాత్రమూ లేదు మీకని శాపనార్ధం పెడుతున్నాడు. వివేకమంటే ఆత్మానాత్మ వివేకమే వివేకం. ఏది ఆత్మో ఏది దాని ఆభాసో తెలియదు వీరికి. పామరులకెలా తెలియదో మహా పండితుల మనుకొన్న మీమాంసకులకు కూడా తెలియదు. అజావి పాలానా మివ గొర్ల కాపరులలాంటి వారు వీరని భగవత్పాదులే చీవాట్లు పెట్టారొక చోట. అసలేదో నకలేదో గుర్తించలేని వారి నేమనాలిక. అసలేమిటి. ఆత్మ అనాత్మ అనే తేడా లేకుండా అంతా సచ్చిద్రూపమైన ఆత్మగా దర్శించటం. అలా దర్శించకపోతే ఆత్మ దూరమై దాని బదులు ఒక ఆత్మగాని ఆత్మ కనిపిస్తుంటుంది. ఏకమైన ఆత్మ చైతన్యమే వీరి అవివేకం మూలంగా అనేకావతారా లెత్తి భాసిస్తుంటుంది. ఇదే ఆభాస. వస్తువు కాదిది. దాని నకలు. ఇప్పుడీ నకిలీ బాపతే దేవత లనండి. పరలోకా లనండి. వారి కోసం చేసే యజ్ఞయాగాది కలాప మనండి. అవి మనకు విధించే
Page 231